వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': 'అలక'

By Pratap
|
Google Oneindia TeluguNews

''అలుగుటయే ఎరుంగని..'' అంటూ ఫర్లాంగు పొడుగు పజ్జం పాట్టంలో ఉద్దేశం ఏవిటీ... అజాతశత్రువు అలిగాడంటే కొంప కొల్లేరయిపోతుందీ కాస్త జాగ్రత్తగా మసులుకోండిరా... అని హెచ్చరించడం... అంటే ఏవిటీ ఎంతటి మహామహితాత్ముడైనా అలగడం సహజం అనే విషయం మనం గ్రహించాలి!... ఎప్పుడో ఆర్నెల్లకో... యాడాదికో అలిగితే ముచ్చటగా వుంటుందీ... దీనికో వ్యాల్యూ ఏడుస్తుంది...

అంతేగాని మీ పక్కింటావిడలాగ పాలు రాకపోతే అలిగీ నీళ్ళు రాకపోతే అలిగీ... పెందరాళే ఇంటికొస్తే అలిగీ ఆలస్యంగా వొస్తే అలుగుతే... ఆ మొగుడు వెధవకి చిర్రెత్తి ఎప్పుడో తనూ అలిగి ఏ కాశీకో గయకో వెళ్ళిపోతాడు.

Tanikella Bharani

అసలీ అలగడం అనే వ్యాధి... మన సంస్కృతిలో ఓ భాగమైపోయింది... ''అలిగిన వేళనే చూడాలి'' అని పాట గూడా వుంది... కన్నయ్య గనక సరదాగా వుంటుందేమోగాని అడ్డమైవాడు అలిగితే ఛంఢాలంగా వుండదు... ఈ అలక్కి ఓ సందర్భం వుంది... అదేమిటయ్యా అంటే వివాహం... ముహుర్తం పెట్టిన లగాయితూ ఇంక అలకలే... పానకచ్చింది ఇస్తామని చెంబిచ్చారూ... అంటూ అలుగుతుంది వియ్యపురాలు... పట్టుచీర లెడ్తామని వొట్టిచీర లెట్టారు... అంటూ ఆడపడుచులు జాయింటుగా అలుగుతారు.

మర్యాదలు సరిగ్గా చేయట్లేదని పెళ్లికొడుకు తండ్రి అలక... ఇలాగ మొగపెళ్ళివారి తరపు వారంత... ఏదో ఒక వంక పెట్టుకుని అలిగేస్తారు... అందర్నీ సవరదీసేసరికి ఆడపిల్ల తండ్రి ప్రాణాలు కళ్లల్లోకొస్తాయి... ఇవి చాలక పెళ్ళికొడుకు స్పెషల్‌ అలక... 'అలక పాన్పు''... అదెక్కినప్పట్నించి ఏమడుగుతాడో అని గుండెలు పీచుపీచుమంటుంటాయి ఆడపెళ్ళివారికి...

తెలివైన పెళ్ళికూతురైతే శోభనం గదిలో అలగాలి... రోగం కుదుర్తుంది!

సత్యభామ అలిగితే... శ్రీకృష్ణుడు ఎన్ని తిప్పలు పడ్డాడూ... తప్పైంది మొర్రో అని చెంపలు వాయించుకున్నాడు... అప్పటికీ మానకపోతే... అలిగితివా సఖీ, ప్రియా అని పాటగూడా పాడాడు... ఆఖరికి కాళ్ళట్టుకున్నాడు... ఆవిడ ఫెడేల్న తన్నింది!

అంచేత విషయమేమిటంటే... అలిగినవాళ్ళని బతిమాలితే మరింత బిగుసుకుపోతారు... అందుకని వాళ్ళజోలికి వెళ్లకూడదు... వారినెవరూ పట్టించుకోవటం లేదని నిర్ధారించుకున్న తర్వాత... వాళ్ళే మెల్లిగా లేచొస్తారు... అలకా గిలకా మానేసి చిలకలా నవ్వుతారు...

English summary
Tollywood actor and writer Tanikella Bharani writes on the pout, how it is projected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X