వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై బోలో గణేష్ మహరాజ్ కీ!

జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు. అందుకే ఆయన్ను విఘ్నేశ్వరుడు అంటారు. ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడుగా కొలుస్తారు. ఏనుగు

By Pratap
|
Google Oneindia TeluguNews

జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు వినాయకుడు. అందుకే ఆయన్ను విఘ్నేశ్వరుడు అంటారు. ఎంతోమంది దేవుళ్లు ఉన్నప్పటికీ మొదట పూజలు అందుకునేది ఆయనే కాబట్టి ఆదిదేవుడుగా కొలుస్తారు. ఏనుగు తల, మనిషి శరీరం కలిగి ఉండి ఒకే దంతం కలిగి ఉండటంచేత ఏకదంతుడుగా కీర్తించబడుతున్నాడు. దేవగణాలకు అధిపతి కాబట్టి గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. సకల లోకాల సర్వ జనులకు శుభాలు కలిగించే ఆ బొజ్జ గణపయ్య పండుగ వినాయక చవితిని అందరూ ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సెప్టెంబరులో చవితి రోజున వినాయకున్ని నిలబెట్టి నవరాత్రులు అచంచల భక్తితో పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేస్తారు.

ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కుమారుడు ఈయన. ఏనుగు ముఖం, తొండం, చేటల వంటి చెవులు, ఏకదంతం, నాలుగు చేతులు, బొజ్జ కలిగి ఉండి, ఎలుక వాహనం, నాలుగు చేతుల్లో ఆయుధాలు, నడుంచుట్టు పామును ధరించి ముఖంలో గొప్ప తేజస్సుతో ఆకర్షణీయంగా ఉంటాడు. విలక్షణమైన రూపు కలిగిన ఆయన రూపంలో ఎంతో పరమార్థం ఉంది. స్వామి తల గొప్పగా ఆలోచించమని, చిన్నగా ఉన్న కళ్లు సూక్ష్మదృష్టి, ఏకాగ్రత కలిగి ఉండాలని, తొండము స్వాభిమానానికి, పెద్దగా ఉన్న చెవులు అన్నింటిని సమానంగా, శ్రద్ధగా చూడమని, చిన్ననోరు తక్కువగా మాట్లాడమని, బొజ్జ చాలా జ్ఞానాన్ని జీర్ణించుకోవాలని, జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కోవాలని, నాలుగు చేతులు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను, ఏకదంతం చెడును వదిలి మంచిని కలిగి ఉండాలని సూచిస్తాయి.

గణపతిలోని రూపాలు
మహాగణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అను 6 రకాల గణపతులను ఆయా ప్రాంతాలలో ఆరాధిస్తారు.

వినాయకుడు తర్పణ ప్రియుడు. పానకం నీటితో ఇరవై ఒక్క రోజులు తర్పణం ఇస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇరవై ఒక్క సంఖ్య ఆయనకు ఇష్టమైనది. ఇష్టమైనది రంగు ఎరుపు, ఇష్టమైనది ఆహారం ఉండ్రాళ్లు వీటితో ఆ దేవదేవుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని గట్టి విశ్వాసం.

విదేశాలలో వినాయకుడు
వినాయకుడిని మనమే కాదు వివిధ దేశాలలో వివిధ పేర్లతో పూజిస్తారు. గ్రీకులు టెర్మినస్, జపానీయులు కాంగితేన్, చైనాలో కువాన్ హి తియేన్, టిబెట్లో డోతవీర, బర్మాలో మహాసిన, కంబోడియాలో కెనెస్, మంగోలియాలో తోస్క్ ప్కాస్క్, ఈజిప్టులో గునేస్, రోమ్ లో జేనస్ పేరుతో పూజిస్తారు.

English summary
Importance of Vinayaka Chaturthi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X