ఐదేళ్ల లాభాల్లో ట్వీట్ ‘ది బెస్ట్’.. విస్తృత సేవల్లో ఫేస్‌బుక్ కంటే సూపర్!!
వాషింగ్టన్: సోషల్ మీడియా వెబ్‌సైట్ 'ట్విట్టర్'!!.. మార్కెట్‌లో అడుగు పెట్టి ఐదేళ్లవుతోంది. ఏళ్ల తరబడి శరవేగంగా ఎదుగుతూ పోటీ పడుతున్న ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్లతో ముందుకు సాగుతోంది ట్విట్టర్. శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా దేశదేశాలకు విస్తరించిన ట్విట్టర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 91 మిలియన్ డాలర్ల నికర లాభాలు గడించింది.
2013లో మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేసిన తర్వాత 'ట్విట్టర్' గడించిన అత్యంత గణనీయ లాభాలు పొందడం ఇదే తొలిసారి. 2016తో పోలిస్తే ఈ ఏడాది ఆదాయంలోనూ రెండు శాతం పెంచుకున్నది ట్విట్టర్. అంచనాలను మించి 732 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించుకున్నది.

ప్రముఖులతో గట్టి పునాది వేసుకున్న ‘ట్విట్టర్’
ఈ సోషల్ వెబ్‌సైట్ నెలవారీగా 330 మిలియన్ల ఖాతాదారులను పెంచుకుంటున్నది. ఇది 2016తో పోలిస్తే నాలుగు శాతం ఎక్కువ. ఫేస్‌బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఉన్నా.. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులతొ గట్టి పునాది సంపాదించుకున్నది. ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లు కూడా ట్విట్టర్ మాదిరిగా విస్తృత రీతిలో ప్రజల్లోకి, ప్రముఖుల గుండెల్లోకి చొచ్చుకు వెళ్లలేకపోయాయంటే అతిశయోక్తి కాదు.

ఫేస్ బుక్ ఖాతాదారులు 200 కోట్ల మంది
ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్ల మాదిరిగా వాణిజ్య ప్రకటనల రూపేణా ఆదాయం తెచ్చుకోవడంలో వెనుకబడింది. నెలవారీగా ఖాతాదారులను 330 మిలియన్ల మందిని పెంచుకున్న ట్విట్టర్‌తో పోలిస్తే ఫేస్ బుక్ కు 200 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. అయితే తాజా ఫలితాల ప్రకటనలో ట్విట్టర్ ఖాతాదారుల వివరాలు స్పష్టంగా చెప్పలేదు కానీ రెండంకెల స్థాయికి పెరిగిందని మాత్రం పేర్కొన్నది. ప్రజా ప్రతినిధుల విమర్శల నుంచి తట్టుకునేందుకు ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రయత్నాలు సాగించాయి. సోషల్ మీడియా వెబ్‌సైట్లపై ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేసినా తట్టుకోగలిగాయి. ట్విట్టర్ సురక్షితంగా ఉంటూనే తమ విధానాలను వివరిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.

ట్విట్టర్ నిడివి పెంపుతో ‘ట్వీట్ల తుఫాన్’
ట్విట్టర్ నెట్వర్క్ అనుక్షణం తన పునాదిని పెంపొందించుకుంటూ నిరంతర అనుబంధం కొనసాగించే దిశగా చర్యలు చేపట్టింది. దీనికి అదనంగా వీడియో భాగస్వామ్యాన్ని జోడించింది. తొలుత గల 280 పదాల ట్వీట్‌ను రెట్టింపు చేసి సందేశాలివ్వడంలో ‘ట్వీట్ల తుఫాన్' కురిపించింది. ట్విట్టర్‌లో సాధించిన ముఖ్యమైన లక్ష్యాల్లో లాభార్జన ఒకటి. బహిరంగ మార్కెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి నిరంతరం వివిధ రూపాల్లో నగదు కోల్పోతూనే ఉన్నది.

సుస్థిర ప్రగతి సాధనపై ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఇలా
ఒకానొక దశలో నిర్వహణలో ఇబ్బందుల నేపథ్యంలో తనను తాను ట్వట్టర్ అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని జోరుగా ఊహాగానాలు సాగాయి. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జాక్ డోర్సీ మాట్లాడుతూ సమర్థవంతంగా ఒక ఏడాదిని అధిగమించి సాదించిన లాభాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. 2017లో సుస్థిర ప్రగతి సాధిస్తూ ట్విట్టర్ ముందడుగు వేసినందుకు తనకు గర్వంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇదే పథంలో ముందుకు సాగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications