వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భానుకిరణ్ అరెస్ట్: సినీ వర్గాల్లో ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అరెస్టుతో సినీ వర్గాలలో కలకలం చెలరేగుతోందని తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా సిఐడి అధికారులు భాను కిరణ్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అతని ఆస్తులపై దర్యాప్తు కొనసాగితే సినీ ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నాయని, దీంతో పలువురిలో గుబులు మొదలైందని అంటున్నారు. సూరి అనుచరుడిగా నగరంలో నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న భాను సినీ వర్గాలతో పరిచయాలు పెంచుకున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇందుకు జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూడా సహకరించాడట. అక్రమాలతో వచ్చిన డబ్బును పెట్టుబడుల రూపంలో సినీ పరిశ్రమలకు మళ్లించడంతో ఫిలింనగర్‌కు చెందిన ప్రముఖులు భానుకు సన్నిహితులుగా మారారని, దీనిపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారని అంటున్నారు. అనేక సినిమాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన భాను తెరవెనుక నిర్మాత అవతారం కూడా ఎత్తిన్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమాలో అతని పెట్టుబడి ఉందని, ఆ తర్వాత ఓ అగ్ర హీరో, దర్శకుడితో సినిమాలు నిర్మించేందుకు భాను ఓ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోందని అంటున్నారు. ఈ పెట్టుబడులకు సహకరించిన సినీ పెద్దలకు ల్యాండ్ సెటిల్‌మెంట్ల ద్వారా సహాయం చేసేవాడని సమాచారం. భానుతో సినీ నిర్మాతలు సి.కళ్యాణ్‌, శింగనమల రమేష్ సంబంధాలు కొనసాగించారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే వారిని పలుమార్లు విచారించారు.

ఈ క్రమంలో మరికొంత మంది పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. సూరి హత్య అనంతరం భాను సెల్‌ఫోన్ కాల్ లిస్టును పరిశీలించిన పోలీసులు కొంతమంది సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్‌ల పేర్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది. కాగా, సినీ పరిశ్రమలో తన మాటకు విలువనివ్వని వారిని భాను బెదిరించేవాడనే వాదన వినిపిస్తోంది.

ఫైనాన్స్ చేయడానికి అంగీకరించలేదని ఓ మహిళా నిర్మాతను కూడా బెదిరించాడట. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఖలేజా ఆడియో హక్కుల వివాదంలో శాలిమార్ అడియో సంస్థ నిర్వాహకులను భాను బెదిరించినట్లు కూడా ఫిర్యాదు నమోదైంది. సినీ పరిశ్రమలో పరిచయాలు పెరిగాక 42 సినిమాలకు భాను ఫైనాన్స్ చేశాడని తెలుస్తోంది.

అగ్రనిర్మాతలు, నటుల చిత్రాల్లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టారనే వాదన వినిపిస్తోంది. ఖలేజాతో పాటు సూరి హత్యకు ముందు వరకు అన్ని పెద్ద సినిమాలకు భాను ఫైనాన్స్ చేశాడట. ఆయా సినిమాల షూటింగ్ స్పాట్‌లకు కూడా వెళ్లేవాడని అంటున్నారు. నిర్మాతలను పిలిపించుకొని కథా చర్చలు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు.

English summary
It is said that some persons from Cine Industry are in tension after Bhanu Kiran's arrest by CID police, who is main accused in Maddelachervu Suri murder case. Already CID police inquired two top producers about links with Bhanu Kiran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X