వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్‌పై సిబిఐ దర్యాప్తుపై ట్విస్టు

జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఇష్టపడరని, దాని వల్ల రాష్టానికి పెట్టుబడులు తగ్గుతాయని ఎన్టీవి చల్లగా ఓ ట్విస్టు ఇచ్చేసింది. అంటే, దర్యాప్తు చేయడం తప్పని ముక్తాయింపు ఇచ్చేసి ఊరుకుందన్న మాట. జగన్‌పై దర్యాప్తునకు, పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు లింక్ కూడా అర్థమైనట్లు లేదు. అసలు వైయస్సార్ హయాంలో వచ్చిన పెట్టుబడులు ఆచరణ రూపం దాల్చాయా, ఫ్యాబ్ సిటీ, సైన్స్ సిటీ, వోక్స్ వ్యాగన్ ... వరుసగా ఏమయ్యాయని అడిగే వారు లేకుండా పోయారా, అది నష్టం కాదా?