మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఆచూకీ ప్రముఖ తెలుగు నిర్మాత సింగనమల రమేష్‌కు తెలుసునని పోలీసులు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రమేష్‌ను చెన్నైలో సిఐడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పరారైన భాను కిరణ్ సింగనమల రమేష్‌తో తరుచుగా మాట్లాడుతున్నారని పోలీసులు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఆయనను నేడో రేపో హైదరాబాదుకు తరలించే అవకాశాలున్నాయి.
సింగనమల వద్ద ఐదు సెల్ ఫోన్లున్నాయట. హైదరాబాదుకు చెందిన ఆయన మొబైల్ ఫోన్లు మాత్రం పనిచేయడం లేదు. కానీ మహారాష్ట్ర, గుర్గావ్, గుజరాత్‌లకు చెందిన ఐదు మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వాటిని పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నాయి. దీన్నిబట్టి భాను కిరణ్ ఎక్కడున్నాడనే విషయం సింగనమలకు తెలుసునని అంటున్నారు.