గేల్ రికార్డు షో: 11 సిక్సర్లు బాదేసిడిలా
ముంబై: భారత్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి తన ఆటతీరుతో అభిమానులను ఉర్రూతలూగించాడు. పవర్ ఫుల్ షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ టీ20 వరల్డ్‌కప్‌లో తొలి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
భారీ లక్ష్యం ముందున్నా.. తడబాటుకు తావివ్వకుండా.. చెలరేగిపోయాడు గేల్. ఒకటా.. రెండా ఏకంగా 11 సిక్సర్లు బాదేశాడు. మరోసారి తానేంత విధ్వంసకర బ్యాట్స్‌మన్ అనేది నిరూపించుకున్నాడు గేల్. టీ-20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, ఓవరాల్‌గా మూడో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.
గేల్ విధ్వంసంతో బుధవారం ఇంగ్లాండ్ జట్టు జరిగిన టీ-20 మ్యాచులో వెస్టిండీస్ అద్భుత విజయం సాధించింది. క్రిస్ గేల్ (48 బంతు ల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్లతో 100 నాటౌట్) మెరుపు శతకంతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో విండీస్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది.

ఇంగ్లండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
గేల్ సూపర్ సిక్సర్ల షో
ఛేదనలో రెండో బంతికే ఓపెనర్ చార్లెస్‌ను అవుట్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్ విల్లే.. విండీస్‌ను తొలి దెబ్బకొట్టాడు. అయితే రెండో ఓవర్లో ఫోర్, సిక్సర్‌తో గేల్ ప్రత్యర్థికి హెచ్చరికలు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శామ్యూల్స్ బౌండ్రీల మీద బౌండ్రీలు సాధించాడు. అయితే ఏడో ఓవర్లో శామ్యూల్స్‌ను రషీద్ అవుట్ చేశాడు.
కానీ, ఈ ఆనందం వారికి ఎంతో సేపు నిలువలేదు. రషీద్ తర్వాతి ఓవర్లో వరుసగా 2 సిక్సర్లతో గేల్ జోరందుకున్నాడు. స్టోక్స్ బౌలింగ్‌లోనూ మరో రెండు సిక్సర్లు రాబట్టాడు. అయితే 12వ ఓవర్లో రామ్‌దిన్ (12)ను మొయిన్ అలీ అవుట్ చేయగా, అదే ఓవర్‌లో సింగిల్ తీసిన గేల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
తర్వాతి ఓవర్లో డ్వేన్ బ్రావో (2)ను అవుట్ చేసిన టాప్లే విండీ్‌సపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశా డు. కానీ, గేల్ మరింత రెచ్చిపోయాడు. అలీ వేసిన 14వ ఓవర్ చివరి మూడు బంతులనూ సిక్సర్లుగా మలిచి స్టేడియాన్ని హోరెత్తించాడు. విల్లే వేసిన 16 ఓవర్లో వరుసగా 4, 6, 6తో విజృంభించాడు.
శతకానికి ముందు కాస్త నెమ్మదించిన గేల్ 18వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి శతకం (47 బంతుల్లోనే) పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లో రస్సెల్ (16 నాటౌట్) విన్నింగ్ షాట్ ఆడాడు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications