నాలెడ్జ్ సెంటర్: జిల్లాకో ఆఫీసు, 2 ఎకరాల్లో నిర్మాణానికి పవన్‌ ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు పవన్‌కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యాలయాలను నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నారు.

2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేయాలని పవన్‌కళ్యాణ్ రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ మేరకు పార్టీ క్యాడర్‌కు శిక్షణ ఇస్తున్నారు. అనంతపురం జిల్లా నుండి పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

అంతేకాదు పార్టీ వాణిని విన్పించేందుకు గాను సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్‌ను కూడ పవన్‌కళ్యాణ్ ఏర్పాటు చేసుకొన్నారు.

ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ కార్యాలయాలు

ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ కార్యాలయాలు

ఏపీ రాష్ట్రంలో జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.13 జిల్లాల్లో జనసేన కార్యాలయాల ఏర్పాటు కోసం పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో జిల్లాల్లో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని పవన్‌ ప్లాన్ చేస్తున్నారు.జనసేన పార్టీ కార్యకలాపాలు ఈ కార్యాలయాల్లో రెగ్యులర్‌గా జరిగేలా జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.

 నాలెడ్జ్ సెంటర్లుగా జనసేన ఆఫీస్‌లు

నాలెడ్జ్ సెంటర్లుగా జనసేన ఆఫీస్‌లు

జనసేన పార్టీ కార్యాలయాలను నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని పవన్‌కళ్యాణ్ యోచిస్తున్నారు. హైద్రాబాద్‌లో టిడిపి కార్యాలయంలో కూడ నాలెడ్జ్ సెంటర్ ఉంది. ఇదే తరహలోనే పవన్‌కళ్యాణ్ కూడ జనసే పార్టీ కార్యాలయాలను నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్దనున్నారు.ఈ కార్యాలయాల్లో విద్యార్థులు, మేధావులు రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

 జనసేన కార్యాలయం కోసం స్థలం అన్వేషణ

జనసేన కార్యాలయం కోసం స్థలం అన్వేషణ

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం పవన్‌కళ్యాణ్ ఇద్దరు పార్టీ నేతలకు పనులు అప్పగించారు. ఇద్దరు పార్టీ నేతలు పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని అన్వేషించేందుకు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నారు.

 తెలంగాణలో 3 జిల్లాలకు పార్టీ కార్యాలయం

తెలంగాణలో 3 జిల్లాలకు పార్టీ కార్యాలయం

తెలంగాణలో రెండు లేదా మూడు జిల్లాలకు ఓ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వపన్‌కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే తర్వాతి కాలంలో జిల్లాకు ఓ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏపీ రాష్ట్రంలో మాత్రం జిల్లాకు ఓ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

 బావ సారుప్యత పార్టీల సమావేశాలు

బావ సారుప్యత పార్టీల సమావేశాలు

బావ సారుప్యత గల పార్టీలు, గ్రూపుల సమావేశాల నిర్వహణకు పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించుకొనే వెసులుబాటు కల్పించేలా పవన్‌కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.రాజకీయాల్లో చోటుచేసుకొంటున్న మార్పులు, దేశంలో, ప్రపంచంలో చోటుచేసుకొంటున్న మార్పులపై మేథావులతో పాటు గ్రూపులు, పార్టీలు ఈ కార్యాలయంలో సమావేశాల నిర్వహణకు పవన్‌కళ్యాణ్ అనుమతి ఇవ్వనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After opening a swanky party office in Hyderabad, Jana Sena chief Pawan Kalyan is looking for huge campuses, each of about 2 acres area in 13 districts of Andhra Pradesh. While these campuses will function as Jana Sena offices, regular meetings of the students and intellectuals will also be held. Pawan Kalyan wants them to emerge as knowledge centres.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి