వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనింగ్ టైకూన్ రాజకీయ 'గాలి' ఎటువైపు?: రీఎంట్రీ తర్వాత పోటీ ఎక్కడి నుంచి?..

దాదాపు ఆరేళ్లుగా కేసులతో సతమతమవుతూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తిరిగి పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

బళ్లారి: దాదాపు ఆరేళ్లుగా కేసులతో సతమతమవుతూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తిరిగి పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు బీజేపీతో ఆయన అంతర్గతంగా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

<strong>ఏపీ ఎఫెక్ట్: బళ్లారిని వదిలి.. అక్కడ చక్రం తిప్పే యోచనలో గాలి</strong>ఏపీ ఎఫెక్ట్: బళ్లారిని వదిలి.. అక్కడ చక్రం తిప్పే యోచనలో గాలి

2011 సెప్టెంబరు 5న అరెస్ట్ అయిన గాలి జనార్ధన్ రెడ్డి.. గతేడాది జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే కుమార్తె వివాహంతో దేశవ్యాప్తంగా ఆయన కుటుంబం వార్తల్లో నిలిచింది. నోట్ల రద్దు సమయంలోను అంగరంగ వైభవంగా కుమార్తె వివాహాన్ని జరిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారాయన.

2018లో అసెంబ్లీకి పోటీ:

2018లో అసెంబ్లీకి పోటీ:

దాదాపు మూడున్నరేళ్లు జైలు జీవితం గడిపిన గాలి జనార్దన్ రెడ్డి.. తిరిగి తన మాతృ పార్టీ ద్వారా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు పార్టీ వర్గాలు కూడా సానుకూలంగానే ఉండటంతో.. 2018అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పైనే ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, షరతులతో కూడిన బెయిల్ నుంచి విముక్తి పొందిన గాలి తన 25వ వివాహా వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సిద్దమవుతున్నారు. ఇందుకు సుప్రీం సైతం అనుమతినివ్వడంతో తన అనుచరులు, సన్నిహితుల నడుమ బళ్లారిలో ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అనుచరుల ఒత్తిళ్లు:

అనుచరుల ఒత్తిళ్లు:

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జనార్దన్ రెడ్డిపై ఆయన అనుచరులు, మద్దతుదారులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అటు బీజేపీ నుంచి కూడా గాలికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుండటంతో ఇక ఆయన పొలిటికల్ రీఎంట్రీ పక్కా అనే చెబుతున్నారు.

ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా గాలికి ఉందని భావిస్తున్న కొంతమంది బీజేపీ నాయకులు.. ఆయన్ను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా కోరినట్లు సమాచారం. అంతేకాదు, అక్రమ మైనింగ్ ఆరోపణలు సైతం రీఎంట్రీకి అడ్డుకాబోవని వారు గాలికి భరోసా ఇస్తున్నట్లు చెబుతున్నారు. కేసులను ఎదుర్కొంటున్న చాలామంది బిజినెస్ మెన్ ఇంకా పాలిటిక్స్ లో కొనసాగుతున్న సంగతిని ఈ సందర్భంగా వారు గాలికి గుర్తుచేస్తున్నారు.

ఏ నియోజకవర్గం నుంచి పోటీ?:

ఏ నియోజకవర్గం నుంచి పోటీ?:

2018అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పరిస్థితులన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఎక్కడి నుంచి పోటీ చేయలనేదానిపై గాలికి ఇంకా స్పష్టత లేదని తెలుస్తోంది. అటు కర్ణాటక పార్టీ చీఫ్ యడ్యూరప్పతోను విభేదాలు సమసిపోయినట్లుగానే కనిపిస్తుండటంతో.. ఆయన రీఎంట్రీ నల్లేరు మీద నడక లాగే కనిపిస్తోంది.

బీజేపీలో తమదంతా ఒక కుటుంబమని, కుటుంబమన్నాక అప్పుడప్పుడు చిన్న చిన్న విబేధాలు వస్తుంటాయి తప్పితే వాటిని తాము పెద్దగా లెక్క చేయమని మే10వ తేదీ గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో ఆయన పునరాగమనానికి ఈ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.

ఏ బాధ్యతైనా చెపట్టడానికి రెడీ!:

ఏ బాధ్యతైనా చెపట్టడానికి రెడీ!:

బీజేపీలోకి రీఎంట్రీ ఇస్తే.. పార్టీలో ఏ బాధ్యతలు అప్పజెప్పినా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. మే 22వ తేదీన ఆయన ఈ ప్రకటన చేశారు. రాయ్ చూర్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. ' ఒక పార్టీ కార్యకర్తగా వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతంకు పనిచేస్తానని' చెప్పుకొచ్చారు.

మరో విషయం కూడా ఆయన స్పష్టం చేశారు. రీఎంట్రీని పక్కనపెడితే వచ్చే ఎన్నికల్లో పోటీని మాత్రం ఆయన ధ్రువీకరించలేదు. దీన్ని బట్టి పార్టీ నిర్ణయిస్తేనే ఆయన తిరిగి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది.

పరిశీలనలో ఈ నియోజకవర్గాలు:

పరిశీలనలో ఈ నియోజకవర్గాలు:

గాలి రీఎంట్రీ పక్కా అని తెలుస్తుండటంతో.. ఆయన గనుక ఎన్నికల బరిలో నిలిస్తే.. గడగ్, రాయ్ చూర్, చిక్ బల్లాపూర్, కేఆర్ పురం, బెంగళూరు, బళ్లారి నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గాలు అటు పార్టీ, ఇటు గాలి పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

బీజేపీ మదిలో 'ఎమ్మెల్సీ':

బీజేపీ మదిలో 'ఎమ్మెల్సీ':

అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలిని ఎన్నికల బరిలో నిలిపడం కన్నా.. ఆయన్ను ఎమ్మెల్సీ చేయాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం గాలి నుంచి బీజేపీ నిధులు రాబడుతుంది కాబట్టి.. ఆయన్ను ఎమ్మెల్సీ చేయడం ఖాయం అని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది.

ఏదేమైనా క్రియాశీలక రాజకీయాల్లో గాలి మరోసారి యాక్టివ్ కావడం ఖాయమని మాత్రం తెలుస్తోంది. అయితే బీజేపీ అధిష్టానం ఆయన పట్ల ఎలా వ్యవహరిస్తుందనే దానిపైనే ఇంతవరకు స్పష్టత లేదు. చూడాలి మరి గాలి భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందో!

English summary
Former BJP minister and beleaguered mining baron Gali Janardhan Reddy who was in jail for three and half years for his alleged involvement in the iron ore mining scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X