మగాడిగా డ్రామా: ముగ్గురు అమ్మాయిలతో రమాదేవి పెళ్లి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: కడప జిల్లాలో కిలాడీ లేడీ విషయం వెలుగు చూసింది. పెళ్లి పేరుతో ఓ యువతి ఆడిన డ్రామా వెలుగు చూసింది. పులివెందులలో ఈ వివాహం జరిగింది. మగాడిలా వేషం మార్చుకుని రమాదేవి మౌనిక అనే యువతితో పరిచయం పెంచుకుంది.

ఆ తర్వాత రమాదేవి ఆమెను వివాహం చేసుకుంది. రమాదేవి మోసాన్ని గుర్తించిన మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని అమ్మేసేందుకు ప్రయత్నించిందని రమాదేవిపై మౌనిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ కూతురిని రమాదేవి పెళ్లి చేసుకోవడపై మౌనిక తల్లిదండ్రులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రమాదేవి, మౌనిక పత్తి మిల్లులో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద్యార్యాప్తు చేపట్టారు.

మూడు పెళ్లిళ్లు చేసుకుంది..

మూడు పెళ్లిళ్లు చేసుకుంది..

18 ఏళ్ల వయస్సు కూడా నిండని రమాదేవి మగదుస్తులు ధరించి అమ్మాయిలను మోసం చేసినట్లు వెలుగు చూసింది. మగాడి వేషంలో ఆమె అంతకు ముందు మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు చెబుతున్నారు.

అమ్మేసేందుకే పెళ్లిళ్లు...

అమ్మేసేందుకే పెళ్లిళ్లు...

అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుని వారిని అమ్మేసేందుకు రమాదేవి ప్రయత్నిస్తోందని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని రమాదేవి ఎందుకు పెళ్లి చేసుకుందనేది తెలియడం లేదు. అయితే, మౌనికకు తాను అమ్మాయిని అని తెలిసే వివాహం చేసుకున్నట్లు రమాదేవి చెబుతోంది.

నోరు తెరవని మౌనిక

నోరు తెరవని మౌనిక

రమాదేవి రెండు రోజులుగా ఏమీ తినలేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. దాంతో ఆమె తీవ్రంగా బలహీనపడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామని, అప్పుడు అసలు విషయం తెలిస్తుందని పోలీసులు అంటున్నారు. మౌనిక మాత్రం ఈ ఘటనపై ఏమీ మాట్లాడడం లేదు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dupimg as male an 18 year old girl Ramadevi married three girls in Kadapa district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి