ఉసిరికాయ నిల్వ పచ్చడి.. ఇలా చేసి తింటే వింటర్ లో ఇమ్యూనిటీ బూస్ట్!
చలికాలంలో మనకు ఉసిరికాయలు చాలా ఎక్కువ దొరుకుతాయి. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుని ఆ పచ్చడిని తింటే ఈ సీజన్లో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఉసిరికాయ నిలవ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచికరంగా ఉంటుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
ఉసిరికాయ నిలువ పచ్చడి పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు- ఒక కేజీ
పల్లీ నూనె లేదా ఆవనూనె- 250 మిల్లీగ్రాములు
మెంతి, జీలకర్ర, ఆవ పొడి- రెండు టేబుల్ స్పూన్లు
కారం- 150 గ్రాములు
ఉప్పు- 150 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు- 15
ఆవాలు, జీలకర్ర- ఒక స్పూన్

ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం
ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి ఆ నూనెలో ఉసిరికాయలను వేసి నిదానంగా మగ్గేలా వేపుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని, మరొక పాన్లో రెండు స్పూన్ల మెంతులు, రెండు స్పూన్ల జీలకర్ర, రెండు స్పూన్ల ఆవాలు వేసుకుని వాటిని కూడా చిన్న సెగ మీద వేయించుకోవాలి.
ఇలా చేస్తే నిల్వ ఉసిరికాయ పచ్చడి రెడీ
చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణలిలో ఉన్న నూనెలో మళ్లీ కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసి అందులో పొడి చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవల పొడిని వేసుకుని, అందులోనే పేర్కొన్న కొలతల మేరకు కారాన్ని, ఉప్పును యాడ్ చేయాలి. బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఉసిరికాయ ముక్కలను కూడా అందులో కలుపుకోవాలి.
నిమ్మకాయ రసంతో ఉసిరికాయ పచ్చడికి కొత్త రుచి
పచ్చడి పులుపు దనం కోసం, నిల్వ ఉండడం కోసం మూడు పెద్ద నిమ్మకాయల రసాన్ని అందులో వేస్తే ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడి ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా రంగు మారకుండా పాడవకుండా ఉంటుంది. ఈ సీజన్లో ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
-
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications