కాకరకాయ చేదే.. కానీ ఇలా వండితే అసలే వదిలిపెట్టరు!
చాలామంది కాకరకాయ కూర తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే కాకరకాయ చేదుగా ఉంటుందని, తినడానికి ఇష్టపడని వారు కాకరకాయలో ఉండే పోషకాలను గురించి తెలుసుకోవాలి. కాకరకాయను చేదు లేకుండా వండేందుకు విధానం ఉంది. ఈ విధానంలో కాకరకాయ కూర వండితే కాకరకాయ కూర విషయంలో కొన్ని టిప్స్ ఫాలో చేస్తే, అసలే కాకరకాయ కూర తినని వారు కూడా కాకరకాయ కూరను లొట్టలు వేస్తూ తినేస్తారు. కాకరకాయ కూర తయారీ విధానాన్ని ప్రస్తుతం తెలుసుకుందాం.
కాకరకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు
కాకరకాయలు- అర కిలో
ఉల్లిపాయలు- నాలుగు పెద్దవి
పచ్చిమిరపకాయలు- ఆరు
కరివేపాకు- రెండు రెమ్మలు
ఉప్పు- రెండు టేబుల్ స్పూన్లు రుచికి తగినంత
పసుపు- అర స్పూను
కారం- రెండు టేబుల్ స్పూన్లు
వెల్లి పాయ రెబ్బలు- 10
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
పోపు గింజలు- ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూన్

కాకరకాయ కూరకు ముఖ్యమైన టిప్ ఇదే
కాకరకాయ కూర తయారు చేయడానికి ముందుగా కాకరకాయ ముక్కలను కట్ చేసుకుని ఈ ముక్కలను బియ్యం కడిగిన నీళ్లలో వేసి అరగంట పాటు వదిలేయాలి. ఆ తర్వాత కాకరకాయలో ఉన్న చేదు అంతా ఈ నీళ్లలోకి చేరుతుంది. కాకరకాయ ముక్కలను బాగా గట్టిగా పిసికి ఆ నీళ్లను పారబోసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ టిప్ తో కాకరకాయలో చేదు రాదు
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పాన్ లో వేసి నూనె వేడి అయిన తర్వాత, పోపు గింజలు వేసి కరివేపాకు వేసి, ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల ముక్కలను వేసుకోవాలి. నాలుగు ఉల్లిపాయలను కట్ చేసి వేయడం వల్ల కాకరకాయల చేదు కూరలో అంతగా ఉండదు. కొద్దిగా మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి.
ఇలా కాకరకాయ వండితే అసలే చేదు ఉండదు
కాకరకాయ ముక్కలు మగ్గుతూ ఉండగా అర టీ స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. సన్నని సెగ మీద కాకరకాయను బాగా వండుకోవాలి. అందులో పది వెల్లిపాయ రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసి కలుపుకోవాలి. మళ్లీ కాకరకాయ బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి, మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే చేదు లేని కాకరకాయ కర్రీ రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, ఆ తర్వాత కాకరకాయ కూర గురించి మీరే చెప్తారు.
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications