పచ్చి మిరపకాయల పచ్చడితో ఇమ్యూనిటీ బూస్ట్.. చేసే విధానమిదే!
పచ్చిమిరపకాయలు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. పచ్చిమిరపకాయలను తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు అందుతాయి. చర్మానికి కూడా పచ్చిమిరపకాయలు ఎంతో మేలు చేస్తాయి. అటువంటి పచ్చిమిరపకాయల తోటి పచ్చి మిరపకాయల పచ్చడి ఏవిధంగా చేయాలో ఈరోజు తెలుసుకుందాం.
పచ్చిమిరపకాయల పచ్చడి తింటే ఆరోగ్యం
జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వేడివేడి అన్నంలో పచ్చిమిరపకాయల పచ్చడి వేసుకుని తింటే నోటికి రుచి తెలుస్తుంది. ఇది మన ఆరోగ్య మెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది. మరి అటువంటి పచ్చిమిరపకాయల పచ్చడిని తయారు చేయడానికి మనకు కావలసిన పదార్థాలు విషయానికొస్తే..

తయారీకి కావాల్సిన పదార్ధాలు
పచ్చిమిరపకాయలు- పావు కిలో
చింతపండు- ఒక ఉసిరికాయ సైజంత
జీలకర్ర - రెండు టేబుల్ స్పూన్లు
ధనియాలు- రెండు టేబుల్ స్పూన్లు
వెల్లి పాయలు- ఆరేడు రెబ్బలు
ఉల్లిపాయ- మీడియం సైజు
ఉప్పు- రుచికి తగినంత
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం
ముందుగా ఒక పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి, వేడి అయిన తర్వాత తొడిమలు తీసి శుభ్రంగా కడిగిన పచ్చిమిరపకాయలను అందులో వేయాలి. దాంతోపాటు ఉసిరికాయ సైజు చింతపండును కూడా అందులో వేసి వేయించాలి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మిక్సీలో గాని, రోట్లో గాని పచ్చడిని నూరుకోవాలి.
పచ్చడి ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా
నూనెలో వేయించిన పచ్చిమిరపకాయలు చింతపండుతో పాటు జీలకర్ర, ధనియాలు, వెల్లి పాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆపై అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కలిపి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే నోటికి రుచి తెలుస్తుంది. అంతేకాదు పచ్చిమిరపకాయల పచ్చడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మన మెటబాలిజం ను మెరుగుపరుస్తుంది.
జీవక్రియను, జీర్ణ క్రియను పెంచే పచ్చిమిర్చి పోషకాల సమ్మేళనం
పచ్చిమిరపకాయల లోని క్యాప్సైసిన్ అనే సమ్మేళనం మన మెటబాలిజంను పెంచడానికి దోహదం చేస్తుంది. ఇది మన జీర్ణక్రియను కూడా పెంచుతుంది. పచ్చిమిరపకాయలలో ఉండే పోషకాల కారణంగా పచ్చి మిర్చి పచ్చడి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. పచ్చి మిరపకాయలలో విటమిన్ C, విటమిన్ A, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
పచ్చి మిర్చితో ఈ లాభాలు కూడా
పచ్చి మిరపకాయలు రోగనిరోధక శక్తిని పెంచడం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మరియు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి.
-
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications