ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నట్లే - ఇలా చేయండి..!!
కిడ్నీలు. పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. ఆ వ్యర్ధాలు పూర్తిగా బయటకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో అవే వ్యర్థాలు కిడ్నీల్లో స్టోన్లుగా మారుతాయి. ఇవి మనకు నొప్పిని, విపరీతమైన ఇబ్బందిని కలగజేస్తాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడే సమయంలోనే మన శరీరం మనకు పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా స్టోన్స్‌ను ముందే తొలగించుకోవచ్చు. దీంతో పరిస్థితి తీవ్రతరం కాకుండా ముందుగానే గుర్తించి కిడ్నీలను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వెనుక అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే మూత్రం లో క్యాల్షియం, ఆగ్జలేట్స్, యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్, సమ్మేళనాలు ఉంటాయి. అయితే నీళ్లను సరైన మోతాదులో తాగితే వీటిని కిడ్నీలు బయటకు పంపిస్తాయి. కానీ ఇవి కిడ్నీల్లో అధికం గా చేరితే ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో అవి స్టోన్స్‌గా మారుతాయి. ఎక్కువగా క్యాల్షియం, ఆగ్జలేట్ స్టోన్లు కిడ్నీల్లో ఏర్పడుతాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడుతున్న సమయం లో శరీరం పలు సంకేతాలను తెలియజేస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో తరచూ జ్వరం వస్తుంది. కొద్ది రోజుల పాటు ఉండి తగ్గుతుంది. మళ్లీ కొన్ని రోజులకు వస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే బొడ్డుకు కింది భాగంలో రెండు వైపులా లేదా అదే ప్రాంతంలో వెనుక వైపు కూడా నొప్పి ఉంటుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు లేదా వంగినప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువవుతుంది. ఆ ప్రాంతంలో సూదుల తో పొడిచినట్లు నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో కొందరికి వికారంగా అనిపిస్తుంది.

కొందరికి వాంతులు కూడా అవుతాయి. కొన్ని రకాల పదార్థాల వాసనలు చూస్తే పొట్టలో తిప్పినట్లు అవుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే తల తిరిగినట్లు కూడా అనిపిస్తుంది. స్పృహ తప్పి పడిపోతామమో నని కూడా అనిపిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారు మూత్ర విసర్జన చేస్తే మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్రంలో నురుగు కూడా కనిపిస్తుంది. మూత్రం ముదురు రంగులో వస్తుంది. కొందరికి మూత్ర విసర్జన సమయంలో రక్తం కూడా పడుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే నిరంతరాయంగా వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఎక్స్‌రే, స్కానింగ్, రక్తం, మూత్రం వంటి పరీక్షల ద్వారా కిడ్నీ స్టోన్లు ఉన్నాయో లేదో నిర్దారిస్తారు. కిడ్నీ స్టోన్లు ఉంటే డాక్టర్లు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుందినిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాలను అధికంగా తింటుంటే కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. తర్బూజా, కీరదోస, పుచ్చకాయలు, ద్రాక్ష పండ్లు, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, కివి, అరటి పండ్లు వంటి పండ్లను రోజూ తింటుంటే ప్రయోజనం ఉంటుంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ












Click it and Unblock the Notifications