Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాతకాలం నాటి 'వెల్లుల్లి రసం'.. ఒక్కసారి టేస్ట్ చేస్తే విడిచిపెట్టరు..!

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి లేకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదు. ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లి అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది. చాలామంది రోజూ పరిగడపున పచ్చి వెల్లుల్లి తింటారు. తద్వారా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. డయాబెటిస్ రోగులకు మేలు జరుగుతుంది. అయితే వెల్లుల్లిని ప్రతి వంటలో వినియోగిస్తుంటారు. వెల్లుల్లితో అనేక రకాల వంటలను ట్రై చేసి ఉంటారు. అయితే వెల్లుల్లి రసం ఎప్పుడైనా ట్రై చేశారా..? పాతకాలం నాటి ఈ వంటకం ఒక్కసారి టేస్ట్ చేస్తే విడిచిపెట్టరు.

మరి వెల్లుల్లి రసం తయారీకి కావాల్సిన పదార్థాలను ఓ సారి చూస్తే.. వెల్లుల్లి రెబ్బలు 30 నుంచి 40, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, టమాటాలు రెండు, చింతపండు 30 గ్రాములు, జీలకర్ర ఓ టీ స్పూన్, ఎండుమిర్చి నాలుగైదు, ఇంగువ అర టీ స్పూన్, పసుపు అర టీ స్పూన్, కారం తగినంత, కొత్తిమీర తురుము తగినంత, నూనె తగినంత తీసుకోవాలి.

వెల్లుల్లి రసం తయారీ విధానం చూస్తే.. ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. మరోవైపు టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలను గ్యాస్ పై సన్నని సెగ మీద కాల్చుకోవాలి. ఇప్పుడు నానిన చింతపండు రసంలో టామాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మాష్ చేయాలి. మెత్తగా మాష్ చేసుకున్నాక రసం తీసి మిగిలిన పిప్పిని పక్కన పడేయాలి. లేదా వీటిని మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోవాలి.

వెల్లుల్లి రసంలో వేసేందుకు మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం.. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేసి లో- ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే తెల్ల నువ్వులు వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న రోలులో వెల్లుల్లి పాయలను వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి.

Garlic Juice Mastery Your Simple Step-by-Step Guide to Homemade Potency

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనే పోయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ముద్ద వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకోవాలి. అందులోనే ఇంగువ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ మిశ్రమంలో పసుపు, కారం, తగినంత ఉప్పు, మసాలా పొడిని కలపాలి. అలాగే ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో టమాటా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అందులో తగినంత నీళ్లు పోసి మరిగించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేస్తే సరి.. వెల్లుల్లి రసం రెడీ అయినట్టే..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+