"గోంగూర పచ్చి రొయ్యల కూర" ఇలా చేస్తే ప్లేట్ ఖాళీనే ..!
అన్ని కూరలు ఉన్నా కానీ గోంగూర అడిగే వారే తెలుగు వారు అంటుంటారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని వంటలలో గోంగూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గోంగూరలో ఉన్న పులుపు రుచికి ఏ ఇతర ఆకుకూరతో పోల్చలేము. ఇది సహజమైన విటమిన్ C, ఐరన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అందుకే, గోంగూర వంటకాలు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివిగా ఉంటాయి. గోంగూరతో చేసిన వంటకం కూడా జీర్ణక్రియకు సహకరిస్తుంది, వేడి తక్కువగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. కాగా గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు ఇలాంటివి మనకు తెలిసిందే
సాధారణంగా మామూలు చికెన్, మటన్ కంటే కూడా సీఫుడ్ లతో గోంగూర కొత్తగా ఉంటుండి. మరీ ముఖ్యంగా రొయ్యలకు గోదావరి జిల్లాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా గోంగూరతో కలిపి చేసే రొయ్యల కూర అక్కడి సంప్రదాయ వంటకాల్లో ఒకటిగా నిలుస్తుంది. గోంగూరలోని పులుపు, రొయ్యల మృదుత్వం కలిసి ఈ కూరకు అదిరిపోయే రుచిని ఇస్తాయి. అన్నంతో తింటే అసలైన గోదావరి టచ్ కనిపిస్తుంది. అందుకే "గోంగూర పచ్చి రొయ్యల కూర" ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ చేయడం పక్కా అంటారు. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు..
- రొయ్యలు - 250 గ్రాములు (శుభ్రం చేసినవి)
- గోంగూర - 2 కట్టలు
- ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి - 3 నుంచి 4 (చీల్చినవి)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - ½ టీస్పూన్
- కారం - 1 నుంచి 1½ టీస్పూన్లు (రుచికి అనుగుణంగా)
- ఉప్పు - అవసరానికి
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - 1 రెమ్మ
- కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
- ఆవాలు - ½ టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 6 నుంచి 8 (నలిగినవి)
ముందస్తు ప్రక్రియ..
- గోంగూర ఆకులను వేరు చేసి బాగా కడగాలి.
- కొద్దిగా నీరు పోసి గోంగూరను మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొంచెం నూరి పక్కన పెట్టుకోవాలి.
- రొయ్యలను శుభ్రం చేసి పసుపు, ఉప్పు చిటికెడు వేసి కలిపి ఉంచాలి.
తయారీ విధానం..
- పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, రొయ్యలను లేతగా వేయించాలి. పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు. వేయించిన రొయ్యలను పక్కన పెట్టుకోవాలి.
- అదే పాన్‌లో మిగతా నూనె వేసి వేడి చేయాలి. ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చే వరకు పోపు పెట్టాలి.
- ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి.
- ఇప్పుడు ఉడికించి నూరిన గోంగూర, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
- ఇందులో ముందుగా వేయించిన రొయ్యలను వేసి మెల్లగా కలపాలి. మూత పెట్టి సన్నని మంట మీద 8-10 నిమిషాలు ఉడికించాలి.
- కూర బాగా దగ్గర పడిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
వడ్డించే విధానం..
- ఈ గోంగూర రొయ్యల కూర వేడి వేడి అన్నంతో అద్భుతంగా ఉంటుంది.
- రసంతో ఉండేలా ఇష్టమైతే కొద్దిగా నీరు కలిపి ఉడికించవచ్చు.
- చపాతీలు లేదా జొన్న రొట్టెలతో కూడా బాగా సరిపోతుంది.
ప్రత్యేక చిట్కాలు..
గోంగూర పులుపు ఎక్కువగా ఉంటే కారం కొంచెం పెంచవచ్చు.
రొయ్యలను ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిపడతాయి కాబట్టి చివర్లో వేసి మగ్గించాలి.
గోదావరి స్టైల్ రుచికి వెల్లుల్లి పోపు చాలా ముఖ్యం.
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
అమ్మకు భరోసా.. మూడు దశాబ్దాల ప్రస్థానంలో భారత్ విజయగాథ -
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications