ఇడ్లీ vs దోశ.. ఎవరికి ఏది మంచిది..!!
దక్షిణాది రాష్ట్రాల్లో అల్పాహారాల్లో ఇడ్లీ లేదా దోశ కామన్. రెండూ పులియబెట్టిన పిండితో తయారు చేసినవే. ఈ రెండిటి ఆకృతి, రుచిలో కొంత భిన్నంగా ఉంటాయి. ఇడ్లీని పూర్తిగా ఆవిరిపై ఉడికిస్తారు.. ఇక, పెనంపై నూనెతో కాల్చిన దోశలు క్రిస్పీగా, కలర్‌ఫుల్ గా నోరూరిస్తూ ఉంటాయి. రుచిలోనూ దేని ప్రత్యేకత దానిదే. కానీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ బెస్ట్ అని చెబుతూ ఉంటారు. అయితే, దోశ ను ఇష్టపడే వారు ఉన్నారు. ఈ రెండింటిలో హెల్తీ ఫుడ్ ఏదనే చర్చ ఉంది. ఎవరికి ఏది మంచిదో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ఇడ్లీ.. దోశ దాదాపుగా ప్రతీ ఇంటా ఉంటాయి. అయితే, ఈ రెండింటి వినియోగం.. ఆరోగ్య ప్రయోజనాల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇడ్లీలను ఆవిరిపై ఉడికించడం వల్ల అవి ఏ మాత్రం నూనెను పీల్చుకోవు. దీనికి విరుద్ధంగా, దోశలను సాధారణంగా క్రిస్పీగా మారడానికి నెయ్యి లేదా నూనెతో పాన్-ఫ్రై చేస్తారు. దీని వలన వాటి కేలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. అదే విధంగా పులియబెట్టిన పిండితో చేసే ఇడ్లీలు ప్రక్రియ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పోషకా ల శోషణను పెంచుతుంది. అన్ని వయసుల వారికి ఇడ్లీలను ఆరోగ్యకరమైన ఎంపిక. ఇడ్లీలు సుల భంగా జీర్ణమవుతాయి. వ్యాయామం తర్వాత తినేందుకు బెస్ట్ ఫుడ్. ఇవి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి కలిగించకుండా అవసరమైన శక్తి, పోషకాలను అందిస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇడ్లీ మంచి ఎంపిక. ఇడ్లీలోని కిణ్వ ప్రక్రియ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదలను తగ్గిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు
అదే విధంగా దోశలు తిన్న తర్వాత కడుపు నిండినట్లుగా అనిపించడమే కాక సంతృప్తిగానూ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్-రిచ్ లేదా ఫైబర్-రిచ్ ఫిల్లింగ్లతో కలిపి తీసుకుంటే. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారి ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. దోశల్లో వివిధ రకాలు ఉంటాయి. వీటి తయారీకి వివిధ రకాల కూరగాయలు, ప్రోటీన్లను జోడించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైనన్ని పోషకాలతో తయారుచేసుకునే సౌలభ్యం ఉంటుంది. దోశలు అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇది అల్పాహారం లేదా వ్యాయామానికి ముందు తింటే స్థిరమైన శక్తి లభిస్తుంది. ఇతర ఆహారపదార్థాల తో పోలిస్తే మంచి ఎంపిక. ఇడ్లీ, దోశల్లో ఏది ఎంచుకోవాలనే ప్రశ్న వస్తే, అది ఆయా వ్యక్తుల ఆరోగ్యకర స్థితి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కడుపుకు మృదువుగా ఉండే తేలికైన, తక్కువ కొవ్వు భోజనం కోసం చూస్తున్నట్లయితే ఇడ్లీ తినడం మంచిది. అలాకాక, కడుపు నిండిన అనుభూతి, రుచి రెండూ కావాలని కోరుకునేవారికి తక్కువ నూనెతో చేసిన దోశ బెస్ట్ ఛాయిస్. ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీలతో కలిపి తింటే ఇడ్లీ, దోశ రెండూ పోషకాహారాలే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
-
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!!












Click it and Unblock the Notifications