మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్ - ఈ రెండిట్లో ఏది మంచిది..!?
నడకతో బోలెడన్న ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. నడకతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కొందరు ఉదయం సమయంలో... మరి కొందరు సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా మందికి మార్నింగ్ వాకింగ్ లేదా సాయంత్రపు నడక బెటరా? ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది అనే ప్రశ్న వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే రెండింట్లో ఏది చేస్తే మెరుగైన ఫలితాలు కలుగుతాయో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. ఉదయం.. సాయంత్రం ఏ సమయంలో చేసినా ఆరోగ్య పరంగా మాత్రం ప్రయోజనాలు ఖాయమని చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీలైన సమయంలో వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. చాలా మంది వాకింగ్ ద్వారా తమ దినచర్య ప్రారంభిస్తారు. గుండె ఆరోగ్యానికి వాకింగ్ అనేది ఎంతో మేలు చేస్తుంది. వాకింగ్ బీపీ, షుగర్, అధిక బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. మార్నింగ్ వాకింగ్ చేసే వారికి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ పెంచటంతో పాటుగా రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె కండరాలకు బలం అందిస్తుంది. బరువు తగ్గేందుకు.. రోజు మొత్తం యాక్టివ్ గా ఉండాలనుకునే వారు మార్నింగ్ వాక్ బెస్ట్ అని సజెస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటుగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా మార్నింగ్ వాక్ ద్వారా విటమిన్ డీ సహజసిద్ధంగా అందుతుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి.. హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వాకింగ్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇక, చాలా మంది సాయంత్రం వాకింగ్ చేసే వారూ ఉన్నారు. ఈవినింగ్ వాక్ ద్వారా రోజంతా ఏర్పడిన మానసిక ఒత్తిడిని తగ్గించుంకోవచ్చు. అదే విధంగా హాయిగా నిద్రపోవాలనుకునే వారికి వినింగ్ వాకింగ్ బెటర్ అని చెబుతున్నారు. సాయంత్రం వరకు కండరాల బలం, పనితీరు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల ఈవినింగ్ వాకింగ్ బాడీ ఫిట్‌నెస్‌కు ఉపయోగ కరంగా ఉంటుంది. అదే విధంగా రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడిచితే జీర్ణక్రియ మెరుగవుతుందని.. షుగరు లెవన్స్ పెరగకుండా ఉంటాయని సూచిస్తున్నారు. తిన్న తరువాత కొద్ది సేపు నడవటంతో ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు, జీవక్రియను సక్రమంగా నిర్వహించేలా సహాయ పడుతుందిని వివరిస్తున్నారు. ఆహారాన్ని సులభంగా జీర్ణించేందుకు, జీవక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. దీంతో.. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏ సమయంలో చేసినా .. వారి శారీరక పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవటం ఉత్తమం.
-
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్ -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
ఎల్లుండే.. పాకిస్తాన్ లో ఏం జరగబోతోంది -
అమెరికా- ఇరాన్ మధ్య సడన్ సీజ్ ఫైర్: 10 పాయింట్స్ ఫార్ములా -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా?













Click it and Unblock the Notifications