బంగాళదుంప రెగ్యులర్ గా తింటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
బంగాళదుంప ప్రతీ ఇంటా ఉంటుంది. విరివిగా వినియోగించే దుంప కూర. తక్కువ ధరలో విరిగా లభిస్తూ ఉంటాయి. వీటితో మనం కూర, పులుసు, వేపుడు వంటి వాటిని చేసి ఆహారంగా తీసుకుంటారు. బంగాళదుంపలో ఫైబర్, విటమిన్ B6, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. పీచు ఎక్కువగా ఉండే బంగాళదుంపలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో రెగ్యులర్ గా బంగాళదుపం వినియోగం ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంగాళదుంపల్లో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు, నరాల పనితీరు పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆట లు ఎక్కువగా ఆడేవారు తక్షణ శక్తి కోసం ఉడికించిన ఆలుగడ్డలను తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని చెబుతున్నారు. బంగాళదుంపను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరగడంతో పాటు రక్తనాళాలు కుచించుకుపోవడం కూడా తగ్గు తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. బంగాళదుంపలు తినడం వల్ల శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. బంగాళదుపంలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.

బంగాళదుంపల్లో బెర్రీలకు సమానమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నశింపజేసి మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని కాపాడడంలో ఆలుగడ్డలు మనకు ఎంతో సహాయపడతాయి.అయితే వీటిని ఉడికించి తీసుకున్ నప్పుడు మాత్రమే మనం ఆ ప్రయోజనాలను పొందగలుగుతాము. వీటిని నూనెలో వేయించి ఉప్పు, కారం వేసి చిప్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే బంగాళదుంప పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు బంగాళదుంపను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. రెగ్యులర్ గా హెల్తీ డైట్ ఫాలో అవుతూ, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మానుకోవటం దాంతో పాటు మీ డైట్ లో బంగాళదుంపలను చేర్చుకుంటే..బరువు పెరిగే సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
గురి చూసి భారత్ రావాల్సిన విమానంపై అమెరికా భారీ దాడి -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!












Click it and Unblock the Notifications