అసలైన షడ్రుచుల ఉగాది పచ్చడి.. ఇలా చేస్తే టేస్ట్ తో పాటు..!
భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. అన్ని కులాలు, మతాల వాళ్లు ఇక్కడ నివసిస్తుంటారు. ఎవరి ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు వారివి. అయితే భారత్ లో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో పండుగకు ఒక్కో విధంగా వంటలు చేసుకుంటూ ఉంటారు. అయితే తెలుగునాట నూతన సంవత్సరంగా భావించే ఉగాదికి ఇంటిల్లిపాదీ ఉగాది పచ్చడి చేసుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఉగాది పచ్చడి కేవలం వంటకం మాత్రమే కాదు ఇది జీవితానికి ఒక సందేశం కూడా..
మరి అసలైన షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..? ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.. ఉగాది పచ్చడి అనేది మొత్తం ఆరు రుచులు కలిగిన ప్రత్యేక వంటకం. ప్రతి రుచి జీవితంలోని ఒక భావాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బెల్లం రెండు టేబుల్ స్పూన్లు, చింతపండు పులుసు ఒక టేబుల్ స్పూన్, పచ్చి మామిడి ముక్కలుగా కట్ చేసి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు, వేపపూలు ఒక టీ స్పూన్, మిరియాల పొడి అర టీ స్పూన్, పచ్చిమిర్చి ఒకటి, నీళ్లు కొద్దిగా, ఉప్పు తగినంత తీసుకోవాలి.

ఉగాది పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా చింతపండును గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. అందులోంచి పులుసు తీసుకోవాలి. ఇప్పుడు ఆ పులుసును వడకట్టి ఒక పాత్రలో పోసుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం వేయాలి. అలా పూర్తిగా కరిగేవరకూ కలుపుకోవాలి. ఆ తర్వాత మిశ్రమంలో పచ్చి మామిడికాయ ముక్కలు, వేపపూలు, పచ్చిమిర్చి లేకుంటే మిరియాల పొడి వేయాలి. అందులోనే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.. అంతే ఉగాది పచ్చడి సిద్ధం అయినట్టే..
-
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications