50 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం.. ఈ రాశులకు డబ్బు, సంతోషం వస్తాయా? రావా?
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిరంతరం సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని యోగాలను ఏర్పరుస్తుంటాయి. త్రిగ్రాహి యోగం, చతుర్గ్రాహి యోగంలాంటివాటితోపాటు అష్టగ్రహ కూటమికి కూడా కారణమవుతాయి. ఇవి మనుషుల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తాయి. డిసెంబరు నెలలో సూర్యుడు, బుధుడు ధనుస్సు రాశిలో, కుజుడు, శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాయి. ధనుస్సు రాశిలోనే చతుర్గ్రాహి యోగం 50 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది. దీనివల్ల ఏయే రాశులకు, ఏవిధమైన ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
మేషరాశి
కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. పనిమీద, వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేస్తారు. అవి లాభసాటిగా ఉంటాయి. పనిలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్థులకు తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది.

ధనుస్సు రాశి
పెళ్లయిన వారు తమ వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వారి నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది. కెరీర్ పరకా కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపే చతుర్గ్రాహి యోగం మీ ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టులకు కూడా సహకారం అందిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా పరిస్థితి బలోపేతమవుతుంది. పదిమందికి సాయం చేసే స్థితికి చేరుకుంటారు. అంకిత భావంతో పనిచేసి జీవితంలో పైకి ఎదుగుతారు.
మీన రాశి
వ్యాపారంలో పురోభివృద్ధి ఉంది. చాలా సృజనాత్మకంగా పనులు పూర్తిచేస్తారు. మీకున్న నాయకత్వ లక్షణాలకు ప్రశంసలు అందుకుంటారు. కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు.
-
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications