• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2020 ఏడాదిలో ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతున్నది.. ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

గ్రహగమనాలు :- 24 జనవరి 2020 న శని ధనుస్సు నుండి మకరరాశికి ప్రయాణం అవుతుంది.ఇది మే 11, 2020 నుండి సెప్టెంబర్ 29, 2020 వరకు వ్యతిరేకదిశలో తిరుగుతూ వెలుతుంది.

బృహస్పతి 2020 మార్చి 29 న మకరరాశి లోకి ప్రవేశిస్తుంది ,ఆ తర్వాత మళ్ళీ జూన్ 30, 2020 న ధనుస్సులోకి ప్రయాణం అవుతుంది. ఇది 2020 మే 14 నుండి 2020 సెప్టెంబర్ 13 వరకు తిరోగమనంగా ప్రయాణం అవుతుంది. ఈ పెద్ద గ్రహాలతో పాటు రాహు మరియు కేతు కూడా వారి స్థానాలను మార్చుకుంటూ మిధునరాశి నుండి వృషభరాశి నుండి ధనుస్సురాశి నుండి వృశ్చికరాశి వరకు ప్రయాణం అవుతాయి. ఇది 2020 సవంత్సరంలో ఒక ముఖ్యమైన కదలికగా చెప్పవచ్చు. ఈ గమనంలో ఈ గ్రహాలు మీ జీవిత పరిణామక్రమాన్ని పూర్తిగా తెలియజేస్తాయి. అయితే మీ జాతక చక్రములో చంద్రుని ఆధారంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీ జాతకం ప్రకారం ఏలా ఉందో మీకు మార్గనిర్దేశం చేయడానికి మేము ఇక్కడ ప్రయత్నించాము.

మేషరాశి ఫలితాలు 2020:-

మేషరాశి ఫలితాలు 2020:-

ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్నయలు చేసే వారు మంచి ఫలితాలను పొందుతారు. శని మకరరాశి నుండి మారినప్పుడు. మీ భవిష్యత్తు బాగుంటుంది మరియు ఉద్యోగ స్థిరత్వం కలుగుతుంది. ఈ సమయంలో సహఉద్యోగులు ,అధికారుల సహకారం లభించి గౌరవ మర్యాదలు పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక లాభాలను పొందుతారు. సంవత్సరం మొదటి నెలలో భారీగా ఆర్దిక లాభాలు కనబడుతాయి. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దీనితో మీరు అనుకున్న పనులను అన్ని విధాల లాభాలను పొందుతారు. సంపదలో పెరుగుదల కనబడుతుంది. ఉద్యోగ రిత్యా ఈ సంవత్సరం మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

వృషభరాశి ఫలితాలు 2020:-

వృషభరాశి ఫలితాలు 2020:-

ఈ సంవత్సరం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఫిబ్రవరి నెలలో మీరు పొందే ఆవకాశం ఎక్కువగా ఉన్నది. శని మకరరాశిలో ఉండటంతో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు అన్ని నెలల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరం అనుకున్న మరియు అనుకోని లాభాలు ప్రాప్తిస్తాయి. నవంబరులో రాహువు మిధునరాశి నుండి వృషభరాశికి వెళ్ళినప్పుడు ఇది మీకు ఉద్యోగ ,వ్యాపార సంపద విషయంలో అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి. మీరు ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు ఉద్యోగ ప్రయాణాలలో ఆరోగ్యనాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. స్వంత ఆలోచాలతో నియంతృత్వ నిర్ణయాలతో పనిచేస్తే ఎక్కువ ఇబ్బందులు వ్యవహార నిర్వహణలో కనబడతాయి.

మిధునరాశి ఫలితాలు 2020

మిధునరాశి ఫలితాలు 2020

ఈ సంవత్సరం మీ జాతక చక్రములో ఉన్న రాహువు స్థాన ఫలితంగా మీరు అనుకున్న ఫలితాలను దక్కనివ్వడు. శని 2020 నుండి ప్రారంభం అవుతుంది, సంవత్సరం అంతా ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లతే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. మార్చి మరియు మే నెలలలో ఉద్యోగంలో ఎక్కువ శ్రద్ద, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శని అష్టమ స్థానానికి చేరుకున్నప్పుడు అదృష్టం కలిసిరాదు. అధికారులతో, సహా ఉద్యోగులతో జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగం సంపాదించడానికి మరింత కృషి, సహనం పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగం కొరకు సీనియర్లు, పై అధికారుల నుండి సహకారాన్ని ఆశిస్తారు కాని మీరు వారి సలహాలను పూర్తిగా ఉపయోగించుకోలేరు. జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా మద్దతుగా ఉండడం వలన శుభఫలితాలు సిద్ధిస్తాయి. గురు గ్రహం మీ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు సామాజిక సంబంధాలతో అనుకూలతలు, సంబంధాలను బలపరుస్తుంది.

కర్కటరాశి ఫలితాలు 2020 :-

కర్కటరాశి ఫలితాలు 2020 :-

ఈ సంవత్సరంలో ఇంక్రిమెంట్లు లేదా కొత్త ఉద్యోగం వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. షష్టమ స్థానంలో రెండు గ్రహాలు, ద్వితీయ సూర్యుని స్థాన ఫలితంగా 2020 సంవత్సరం ప్రారంభం మీకు ఉద్యోగ వ్యవహారంలో కొంత అననుకూలతలు, మానసిక ఒత్తిడి వంటివి కనబడుతాయి. ఈ సంవత్సరం జులై - ఆగష్టు నెలల్లో మీరు విదేశీ వ్యవహార సంబంధిత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఆరవ స్థానంలో ఉన్నకేతు గ్రహ ప్రభావం చేత ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యమైన ఇంటర్వుల సమయంలో ఇబ్బందులు ఎదురైయే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం మార్చి-జూలై నెలల్లో నూతన ఉద్యోగం, వ్యాపార లాభాలతో డబ్బు సంతృప్తికరంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం మీ జీతం కూడా పెరిగే అవకాశాలుకూడా ఉన్నాయి.

సింహరాశి ఫలితాలు 2020

సింహరాశి ఫలితాలు 2020

సంవత్సరం ఉద్యోగాభివృద్ధి, మీ నైపున్యతకు ప్రశంసలు పొందుతారు. మీ సహోద్యోగులు కూడా మీకు సహాయం చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యవహారాలలో అనుకూలతలు సమృద్ధిగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం బాగుంది. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. మీ సామర్థ్యం వల్ల అదనపు డబ్బు సంపాదించవచ్చును. ఆరవ స్థానంలో శని సంచారం వలన ఉద్యోగంలో మీకున్న అంతర్గత శత్రువులపై విజయం సాధించిన సంకేతాలను చూపిస్తుంది. ఉద్యోగ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ స్థిరత్వం వలన భూమి, వాహనం కానీ కొనవచ్చును.

కన్యరాశి ఫలితాలు 2020

కన్యరాశి ఫలితాలు 2020

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మీ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో ఉద్యోగ, వ్యవహార స్థలంలో అంతగా అనుకూలతలు ఉండక పోవచ్చును . మీ పై అధికారుల నుండి సహకారాన్ని పొందుతారు మరియు మార్చి - మే నెలలో అనుకూలం. మీకు సొంత వ్యవహారం ఉన్నట్లయితే మీరు ఆ వ్యాపారాన్ని చిన్నగా అభివృద్ధి చేసుకుంటారు. ముఖ్యంగా మార్చి - మే నెల్లలో మీరు మీకు కావలిసిన ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మీ ఉద్యోగ జీవితం ,వ్యవహార జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరం విజయం జీవిత భాగస్వామి నుండి కలుగుతుంది.

తులరాశి ఫలితాలు 2020

తులరాశి ఫలితాలు 2020

సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన, వ్యాపారం రంగాలలో మీరు అనుకున్న ఫలితాలను చూస్తారు. సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగ సౌఖ్యం కలిగి ఉంటారు. అన్నివిధాలుగా ఈ సంవత్సరం మీ ఉద్యోగ పరిస్థితి బాగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. మీ సీనియర్ మరియు సహ ఉద్యోగుల నుండి మద్దతు పొందవచ్చు లేదా అధికారికంగ ఉద్యోగోములో అభివృద్ధిని పొందవచ్చు. మీకు అదృష్టం సంవత్సరం మొత్తం తోడుగా ఉంటుంది. జనవరి నెలలో మీ ఆరవ స్థానం కారణంగా ఏడాది పొడవునా శనిచేత ప్రయోజనం పొందుతారు.

వృశ్చికరాశి ఫలితాలు 2020

వృశ్చికరాశి ఫలితాలు 2020

సంవత్సరం ఉద్యోగంలో శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం వృశ్చికరాశి వారి ఆర్థిక, వ్యాపార మరియు వృత్తి జీవన పరంగా అనుకున్న ఫలితాలను పొందుతారు. 2020 సంవత్సరం ప్రారంభంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ నెలలో కొంత మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ఈ సంవత్సరం మీ వృత్తి జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయంలో మీ జీతంలో పెరుగుదల ఉంటుంది. గురుడు మీ జాతకచక్రంలో ఎక్కువ కాలం మీ రెండవ స్థానంలోనే ఉంటాడు, దీని ప్రభావంతో మీకు సంవత్సరం పొడవునా ధనం ప్రాప్తిస్తుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనుస్సురాశి ఫలితాలు 2020

ధనుస్సురాశి ఫలితాలు 2020

సంవంత్సరం ఉద్యోగ , వ్యాపారం అంశాలలో మంచి ఫలితాలను ఆశించవచ్చును. ఆర్థిక పరమైన ఎదుగుదలను కూడా ఆశించవచ్చు. ఏప్రిల్-మే మరియు ఆగస్టు నెలలలో కొంత ఉద్యోగ వ్యవహారాలలో ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ సంవత్సరంలో వృత్తి పరమైన జీవితంలో గొప్ప ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. జనవరి నెలలో విజయాల కోసం ఎక్కువ కృషి చేయవలిసి ఉంటుంది. దీనితో మీకు జనవరి - ఫిబ్రవరి నెలలలో ఆకస్మిక ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలో మీ జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గురు గ్రహం ఈ సంవత్సరంలో మీ ఒకటవ స్థానంలో ప్రవేశం చేస్తున్నాడు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. గురువు వలన ఆనందం, శ్రేయస్సునకు అనుకూలుడుగా ఉంటాడు.

మకరరాశి ఫలితాలు 2020

మకరరాశి ఫలితాలు 2020

సంవత్సరంలో చంద్రుడు మిశ్రమ ఫలితాలను అందిస్తునాడు. ఈ సంవత్సరంలో వృత్తి మరియు వ్యాపార రంగాలలో శుభ ఫలితాలను ఆశించవచ్చును. మీ లగ్నస్థానంలోని గ్రహం మరియు రెండవ స్థానంలో గ్రహం శని మొదట మీ పన్నెండవ స్థానంలో నుండి ఒకరిని ఒకరు వక్రంగా చూసుకోవడం వలన ఉద్యోగ సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఆచి తూచి వ్యవహరించాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. ఈ సంవత్సరం మార్చి మరియు మే నెలలో వృత్తి జీవితం చాలా బాగా అభివృద్ది చెందుతుంది. ఈ సమయంలో ఉద్యోగం కూడా బదిలీ అవ్వచ్చును. విదేశీ వాణిజ్యం మరియు సంబంధాలు పెరుగుతాయి.రాహువు తన స్థితిని మార్చుకున్న తర్వాత సెప్టెంబర్ నెలలో మంచి ఆదాయం లభిస్తుంది.

కుంభరాశి ఫలితాలు 2020

కుంభరాశి ఫలితాలు 2020

సంవంత్సరం గురువు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఉద్యోగ ,వ్యవహార అనుకూలతలు వచ్చే అవకాశాలు బలీయంగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన గలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సొంత వ్యాపారాన్ని చేస్తున్నట్లు అయితే మీరు తొందరపాటుతో ఆలోచన చేయకుండా నిర్ణయాలను తీసుకోవద్దు. ఈ సంవత్సరం మద్యలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని కోసం మీరు ఆయా రంగలలోని నిపుణులైన వారిని సంప్రదించి నిర్ణయాలను తీసుకోండి. ఈ సంవత్సరం మీ పన్నెండవ స్థానంలో శని ప్రవేశం నుండి మీరు రోజువారీ ఆదాయం అనుకూలంగా ఉండకపోవచ్చును. ఖర్చులను అధికం చేస్తుంది. ఈ సంవత్సరం సమయం వృధా చేయక ఎక్కువ కృషి చేస్తే వృత్తి పరమైన జీవితంలో బిజీగా ఉంటారు,ఉద్యోగరిత్య కుటుంబ జీవితానికి కూడా కొంచం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మీనరాశి ఫలితాలు 2020

మీనరాశి ఫలితాలు 2020

సంవత్సరంలో వృత్తి , ఆర్థిక వ్యాపార పరమైన అంశాలలో మంచి ఫలితాలను పొంద వచ్చును. ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు అనుకూలం. ఈ సంవత్సరం మార్చి లేదా మే నెలలో మీ పై ఉద్యోగానికి బదిలీ కావచ్చును. ఈ సంవత్సరం మీ ప్రయత్నాలతో నిర్విరామ కృషితో విజయాలను పొందుతారు. సొంత వ్యాపారాలలో ఎక్కువ లాభాలను పొందుతారు. విదేశీ వ్యవహారాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చును.ఈ సంవత్సరం మీనరాశి వారు విజయాలను చవి చూడడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. నిరుద్యోగులు ఈ సంవత్సరం మంచి ఉద్యోగాన్ని పొందుతారు. గురు, శని మరియు కుజ గ్రహం కారణంగా లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులు అన్ని పనులలో మీకు సహయ సహాకారాన్ని అందిస్తారు.

English summary
News year 2020 predictions is feel good for everyone. This article deals with Horoscope 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X