ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది.
మేషరాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుండగా, వృషభరాశివారికి బృహస్పతి అనుగ్రహం బాగా లభిస్తోంది. గ్రహ సంచారాన్ని బట్టి ఇలా ఉన్నప్పటికీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనిదేవుడిని పూజించాలి. అలాగే బృహస్పతిని కూడా పూజించాలి. ఏప్రిల్ నెలలో ఈ రెండు రాశులవారి జాతక ఫలం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. ఏప్రిల్ 11వ తేదీవరకు బుధుడు అనుకూలంగా ఉంటాడు. దీంతో వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు ఉచ్ఛస్థితికి చేరుకోవడం వల్ల ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే సహనం కావాలి.
ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. శుక్రుడి సంచారం వల్ల విలాసాలకు, ప్రయాణాలకు ఖర్చు విపరీతంగా పెట్టాల్సి వస్తుంది. శారీరక అలసట, మానసిక ఒత్తిడి కలుగుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం, దైవ చింతన ఈ రాశివారికి మేలు చేస్తాయి. తల్లితో సమానమైన స్త్రీలకు పాలు, చక్కెర నైవేద్యంగా ఇవ్వడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వీరికి ఎంతో శుభప్రదం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. 11వ తేదీ వరకు కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులున్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ నెలలో ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా గృహ నిర్మాణ పనులకు ఇది సరైన సమయం. ఎందుకంటే వీటికోసం మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు కాబట్టి.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. అందరిమధ్య ఐకమత్యం విలసిల్లుతుంది. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడి అనుకూలత వల్ల దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. ఆరోగ్యం బాగున్నప్పటికీ కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు. మెడలో వెండి గొలుసు ధరించడం లేదా లక్ష్మీ దేవిని ఆరాధించడం మంచి ఫలితాలను ఇస్తుంది.
-
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications