Horoscope today: సూర్య చంద్రుల సంచారంతో నేడు ఈ రాశులవారికి జాక్ పాట్!
డిసెంబర్ 8 2025 సోమవారం సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ఇక ఈరోజు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరికి శుభ ఫలితాలు వస్తాయి? ఎవరు అశుభ ఫలితాలను చూస్తారు? వంటి వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
నేడు మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం శుభంగా ఉంటుంది. స్వల్ప ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి .ఆరోగ్యం బాగుంటుంది. పనులలో వేగం పెరుగుతుంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు కుటుంబంలో సంతోషం ఉంటుంది .కార్యాలయంలో గుర్తింపు ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు.
మిధున రాశి
మిధున రాశి జాతకులు ఏదైనా సమస్యలను పరిష్కరించుకుంటారు. స్నేహితుల మధ్య సఖ్యత ఉంటుంది. ప్రయాణ యోచనలు ఉంటాయి. ఈరోజు మిధున రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నేడు ఆందోళనలు తగ్గుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పెద్దలతో మాట్లాడితే వారిచ్చే సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
సింహరాశి
సింహ రాశి వారికి పని పట్ల క్రమశిక్షణ పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు విషయాలలో శుభవార్తలు వింటారు.ఇది వీరికి మంచి సమయం.
కన్యారాశి
కన్యా రాశి వారికి మానసికంగా శాంతి లభిస్తుంది. కుటుంబంలో కొత్త ప్రణాళికలు కనిపిస్తాయి. వ్యాపారంలో స్థిర లాభం ఉంటుంది. ఇది అన్ని విధాల కన్యా రాశి వారికి మేలు చేస్తుంది.
తులారాశి
తులా రాశి వారికి పాత పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి . ప్రేమ సంబంధాలు బలోపేతం అవుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కొత్త పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తులు, లీగల్ విషయాలలో పురోగతి ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం పై కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి నేడు ఇంట్లో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. డబ్బుల విషయంలో సానుకూలత ఉంటుంది. పనుల్లో కొంత శ్రమ ఉన్న ఫలితం మంచిగా వస్తుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి కుటుంబ అనుకూలత కనిపిస్తుంది. స్నేహితుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది.
మీనరాశి
మీన రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా గణనీయమైన మెరుగుదల ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రిస్తే మంచి ఫలితం ఉంటుంది
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications