వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పితృదేవతలు ఎవరు?: పితృదేవతలు-భూతప్రేతాలు ఒకరేనా?

బ్రాహ్మణుల పితరులు అగ్నిష్వాత్తులని, క్షత్రియలకు బర్దిషదులని, వైశ్యులకు కావ్యలని, శూద్రులకు సుకాలినులని పిలవబడతారని నంది పురాణంలో హేమాద్రి పేర్కొన్నాడు.

|
Google Oneindia TeluguNews

తండ్రి, తాత,ముత్తాతలకు పితరులు' అనే శబ్దం వాడటం వారి అధిష్టాన దేవతలైన వసు, రుద్ర, ఆదిత్యు లకు చెందుట మరొకటి. ఈ రెండు అర్థాల్లో ఈ పదం వాడబడింది. వీరిలో అనేకరకాలు- అంగిరసులు, వైరూపులు, అథర్వణులు, భృగువులు, నవగ్వులు, దశగ్యులుగా ఋగ్వేదంలో చెప్పబడ్డారు.

బ్రాహ్మణుల పితరులు అగ్నిష్వాత్తులని, క్షత్రియలకు బర్దిషదులని, వైశ్యులకు కావ్యలని, శూద్రులకు సుకాలినులని పిలవబడతారని నంది పురాణంలో హేమాద్రి పేర్కొన్నాడు. శాతాతసృతి 12 పితృవర్గాలను వివరిస్తుంది. విష్ణు ధర్మోత్తరాన్ని బట్టి కొంతమంది పితృదేవతలు మూర్తి లేక ఉంటారట. కొంతమంది మూర్తి కలిగి ఉంటారట. ఋషుల నుండి పితృదేవతలు, వారినుండి దేవతలు, వారినుండి మానవులు పుట్టినట్ల మనువు చెప్పాడు.

దేవతలు తూర్పుకు, పితృదేవతలు దక్షిణపు దిక్కుకు, మానవులు పశ్చిమ దిక్కుకు, రుద్రులు ఉత్తరపు దిక్కుకు చెందిన వారని తైత్తిరీయ సంహిత" అంటుంది. దేవతలకు స్వహావషట్కారాలతో, పితృదేవతలకు స్వధానమస్కారా లతో పూజ జరుగుతుంది.

is pitru devatas and satans are same?

వీరెక్కడ ఉంటారు? భూలోకం పైన అంతరిక్షం, ఆపైన పితృలోకం ఉంటుందని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతుంది. "విధూర్ధ్వలోకే పితరో వసంతి" చంద్రమండలం పైన పితృగణాలు ఉంటారు. చంద్రలోకం జల మయమైనది. జలమయమైన లోకమంటే పైన అగ్ని ష్వాత్తాది పిత్స గణాలు ఉంటారని భాగవతం అంటుంది.

ఇక అథర్వవేదంలో ఇలా ఉంది"ఉదస్వతీ ద్యౌరవమా పేలుమతీతి మధ్యమా తృతీయహ ప్రద్యౌరితి యస్యాం పితర ఆసతే" ఆకాశం మొదటి కక్ష్యను 'అవమ' అంటారు. అది జలమయమైనది. మధ్యమ కక్ష్యను పిలమతి' అని పిలుస్తారు.

అంటే- పరమాణు రూపమైనది. తృతీయ కక్ష్యకు ప్రద్యౌ అని పేరు. అది ప్రకాశమయం. అందులో పితరులు ఉంటారు. ఇక శ్రాద్దాలను పెట్టి పితృదేవతలను పూజించటంలో ప్రయోజనం ఏమిటి? యాజ్ఞవల్క్య స్మతిపై విశ్వరూప వ్యాఖ్యను తిలకించండి- పిత్స దేవతలను తృప్తిపరచు అని శాస్త్రం చెప్పింది కనుక చేయటం ఒకటి.

పితృదేవతలు తృప్తిని పొంది కర్త సుఖాన్ని పొందితే శంకకే తావులేదు కదా! వసు-రుద్ర-ఆదిత్యులు ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగల సమర్ధులు, అటువంటి వారు కర్తను, కర్త యొక్క తండ్రి, తాత,ముత్తా లను సంతోషపెట్టవచ్చు కదా? అని నాస్తికులను ప్రశ్నించాడు.

నారాయణ పండితుని శ్రాద్దకల్పలతలో ఇలా ఉంది
శ్రాద్దం ఎలా నిప్రయోజనమవుతుంది? అని ప్రశ్నించి,
1. శ్రాద్దాలు పెట్టమని చెప్పే పుస్తకాలు లేవంటావా?
2. శ్రాద్దం వల్ల పితరులు సంతోషపడరంటావా?
3, లేక పెట్టటంలో ఫలం లేదంటావా? అనే ప్రశ్నలకు పెట్టమని చెప్పే శ్రుతి స్మృతులు అనేకం ఉన్నాయి!
తండ్రి మొదలైనవారికి అధిష్టాన దేవతలకు చెందుతున్నాయి కదా! దీర్ఘజీవనం మొదలైన ఫలాలు లభిస్తున్నాయి కదా! అని సమాధానాలు చెప్పాడు నారాయణ పండితుడు.

వెంకయ్య పుల్లయ్య అని పేర్లు శరీరాలకా? చైతన్యంతో కూడిన వ్యక్తులకా? చైతన్యంతో కూడిన శరీరాలనే అలా పిలుస్తున్నాం. అదే విధంగా పితృపితామహ, ప్రపితామహులతో కూడిన వసు రుద్రాదిత్యు లని భావించాలి. కర్మకాండచే ఆ దేవతలు పొందితే తద్వారా పితరులు కూడా సంతోషపడతారు.

ఒక గర్భిణీకి అన్నపానాదులిచ్చి ఆమెను తృప్తిపరిస్తే ఆమె తృప్తిపడటమే గాక లోనున్న పిండానికి తృప్తిని కలిగించినట్లవుతుంది. అలాగే పై దానిని కూడా అన్వయించవచ్చని అతడు రాశాడు.

బతికివున్న వానికి పెట్టిన లాభం కలదు గాని చనిన వానికి పెట్టటంలో అర్థముందా? ఇక చనినవాడు అన్నం తింటాడా? ఎలా తింటాడు? ఎలా అతనికి చెందుతుంది? పునర్జన్మను అంగీకరిస్తున్నాం కదా? చచ్చినవాడు ఏ రూపమెత్తి ఎలా తింటాడని అనేక సందేహాలు,
దీనికంతకు సంకల్పశక్తి మంత్రశక్తి మొదలైనవాటి ప్రభావాన్ని గుర్తిస్తే సందేహాలకు తావులేదు.

"యధా గోషు ప్రనష్టాసు వతో విందతి మాతరమ్
తథా శ్రాద్దేషు దృష్టాంతో (దత్తాను?) మంత్ర"

పితృదేవతలు - భూతప్రేతాలు వేర్వేరు!
ఈ లోకంలో మరణించిన వారు ప్రేతం అనబడతారని శాస్రాలు చెబుతున్నాయి. మనుషులు మరణించిన తరవాత చేసే కర్మలను ప్రేతకర్మలు అనటానికి కారణం ఇదే. ఈ కర్మలన్నింటికీ సంబంధించిన శాస్త్రీయభాష ఇదే.

"మరణించిన తరవాత ప్రతివ్యక్తి ప్రేతం అయితే- ఆ ప్రేతం ఈ లోకంలోని తన కుటుంబీకులకు కూడా దుఃఖం కలిగిస్తుందా?" అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. దీనికి సమాధానం కూడా మన శాస్రాల్లోనే ఉంది. కుటుంబంలో మరణిం చినవారు, ఆ కుటుంబసభ్యులకు పితృదేవతలవుతారు.

ప్రేతాలు' అనకూడదు. ఈ లోకంలో పాపకర్మలు చేసినవారు నీచయోనుల్లోకి వెల్లి పురుషులైతే భూత-ప్రేత పిశాచాలుగా, స్త్రీలైతే ప్రేతనీ-పిశాచీ లుగా మారతారు. పితృదేవతలు భూత-ప్రేతాలు కారు. వారు వేరుగా ఉంటారు. పితరులు ఈ లోకంలో తమ కుటుంబసభ్యులతో మాత్రమే సంబంధం కలిగి ఉంటారు. అవసరమైనప్పుడు ఈ లోకంలోని తమ కుటుంబసభ్యులకు సహాయం కూడా చేస్తుంటారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకుని, అన్నిరకాలైన లాభాలనూ పొందవచ్చు.

అందువల్లనే కుటుంబంలో ఎవరైనా చనిపోతే-వారిని సంతృప్తిపరచటానికై బ్రాహ్మణులకు భోజనాలు పెట్టటం, దానాలు ఇవ్వటం వంటివి చేస్తుంటారు. పాలతో వండిన పరమానం, హల్వా తదితర పదార్థాలను పితృదేవతలు సంతోషంగా స్వీకరిస్తారు. పితృదేవతలు కాలధర్మం చెందిన పుణ్యతిథినాడు ఇటువంటి భోజనాన్ని బ్రాహ్మణులకు పెడితే, పితృదేవతలు సంతృప్తి చెందుతారు.

పితృదేవతల కారణంగా కుటుంబంలోని వారికి దుఃఖం కలగకూడదనే ఉద్దేశంతో- అమావాస్యనాడు తమ పితరులను గుర్తు చేసుకుంటూ, బ్రాహ్మణులను పిలచి వారికి ధాన్యమిస్తారు. భూత-ప్రేతాదులు మన జోలికి రాకుండా రక్షణ కోసమై శ్రీమద్బాగవతం, భగవద్గీత, రామాయణం వంటి గ్రంథాలను చదువుతారు.

English summary
"Pitru" is referred to our ancestors or family members who have dead. As per our scriptures Pitru are similar to God, but if we make Pitru happy then it is not hard to make God happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X