Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహాశివరాత్రి వేళ శక్తివంతమైన చతుర్గ్రాహి యోగంతో నక్కతోక తొక్కే రాశులివే!

జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగానే ద్వాదశ రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి పర్వదినాన గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈనెల 15వ తేదీన ఆదివారం మహాశివరాత్రి పర్వదినం జరగనుండగా అదే రోజు ఒక యాదృచ్ఛిక సంఘటన జరుగుతుంది.

మహా శివరాత్రి నాడు కుంభరాశిలో చతుర్గ్రాహి యోగం

మహాశివరాత్రి పర్వదినాన కుంభరాశిలో చతుర్గ్రాహి యోగం, బుధాదిత్య యోగం, సర్వార్ధ సిద్ధి యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడే యోగాలతో అదృష్టవంతులు అవుతున్న ఆ రాశుల వారి గురించి తెలుసుకుందాం.

Maha Shivratri day A powerful Chaturgrahi Yoga A shower of wealth for these zodiac signs from feb15th

మేషరాశి

మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడే శుభయోగాల కారణంగా మేష రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శివయ్య ప్రత్యేక అనుగ్రహంతో మేషరాశి జాతకులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఏలినాటి శని ప్రభావం నుంచి కూడా కొంత ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి .వ్యాపారులకు లాభాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కన్యారాశి

మహాశివరాత్రి పర్వదినాన కన్యారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకులు కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించిన ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు.

మకర రాశి

మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడే శుభ యోగాల కారణంగా మకర రాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో మీ వివాదాలు తొలగిపోయి, ఆర్థికపరమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు ఊహించని ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి ఆశీస్సులు లభిస్తాయి.

కుంభరాశి

మహాశివరాత్రి పర్వదినాన కుంభ రాశి జాతకులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఏర్పడే శుభ యోగాల కారణంగా కుంభ రాశి జాతకులు అన్ని విధాల లబ్ధిని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసే అవకాశం ఉంది. చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాలను సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరికి శివయ్య ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+