సరిగ్గా పదిరోజుల్లోనే వీరు పట్టిందల్లా బంగారం అయ్యి తీరుతుంది!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి. 2025 డిసెంబర్లో ముఖ్య గ్రహాల రవాణా వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. డిసెంబర్ మాసంలో గురుడు మిధున రాశిలోకి, కుజుడు ధనుస్సు రాశిలోకి, సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు రెండుసార్లు సంచారం చేస్తున్నాడు. ఈ మార్పులు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాయి.
డిసెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం
డిసెంబర్ 5న బృహస్పతి మిదునరాశిలోకి వెళ్తాడు. డిసెంబర్ 7న కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ మాసంలో బుధుడు వృశ్చిక మరియు ధనుస్సు రాశిలో రెండు సార్లు సంచారం చేస్తాడు. ఇక సూర్యుడు డిసెంబర్ 16వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా డిసెంబర్ మాసంలో జరిగే సంచారాలతో లబ్ధిని పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి ఈ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏం చేసినా సానుకూల ఫలితాలను చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. ఇది మేష రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలంటే ఈ సమయంలో పెట్టుకుంటే మంచిది. ఉద్యోగాలు చేసేవారు కూడా ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు.
సింహరాశి
సింహరాశి వారికి డిసెంబర్ మాసం అదృష్ట మాసంగా మారుతుంది. సింహరాశి జాతకులు డిసెంబర్ మాసంలో అన్ని విధాల ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా వీరు డిసెంబర్ మాసంలో శుక్రుడు సంచారం కారణంగా మంచి లాభాలను, అదృష్టాన్ని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. వృత్తిపరమైన సమస్యల పరిష్కారమై అన్ని విధాలా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది శుభ సమయంగా చెప్పవచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
డిసెంబర్ మాసం ధనుస్సు రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా సానుకూల ఫలితాలను చూస్తారు. కుజుడు మరియు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఇది వీరికి అన్ని విధాల అనుకూల సమయం.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications