30 ఏళ్ల తర్వాత అరుదైన నవ పంచమ రాజయోగం.. ఈ రాశుల వారి నక్కతోక తొక్కినట్టే..!
ఆకాశంలో అద్భుతం.. 30 ఏళ్ల తర్వాత కనువిందు చేయబోతున్న నవ పంచమ రాజయోగం మీ తలరాతను మార్చబోతోంది. శని దేవుడు, బుధ గ్రహాల అరుదైన కలయికతో కొత్త ఏడాది 2026 ప్రారంభంలోనే అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి కనకవర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి:
విజయాల పరంపర మిథున రాశి వారికి ఈ రాజయోగం ఒక వరంలా మారబోతోంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు , భారీగా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలతో లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మకర రాశి
ధైర్యమే మీ పెట్టుబడి మకర రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా, పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ చిరకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. సోదరుల మద్దతుతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి
అడ్డంకులు తొలగి.. అదృష్టం వరించి కర్కాటక రాశి వారికి ఇన్నాళ్లుగా ఉన్న ఆటంకాలన్నీ పటాపంచలు కానున్నాయి. కొత్త వృత్తిని ప్రారంభించాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.
మరో కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ నూతన సంవత్సరం, ఈ మూడు రాశుల వారికి అపారమైన ధనాన్ని, కీర్తిని ప్రసాదించబోతోంది. సిద్ధంగా ఉండండి.. మీ అదృష్ట కాలం మొదలైంది.
గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాలు మరియు జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ఇవ్వబడింది. దీనిని పాటించే ముందు నిపుణులను సంప్రదించగలరు.
-
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications