ఇదీ బోనాల విశిష్టత: ఎందుకు చేస్తారో తెలుసా!..

Subscribe to Oneindia Telugu

బోనాలు ఎందుకు ? ఎలా చేస్తారు ?

ప్రపంచంలోని అన్ని సంస్కృతులలోను సామాన్యంగా కనిపించే లక్షణం మాతృ ఆరాధనం. పరమాత్ముని జగత్సితగా, ప్రకృతిని జగన్మాతగా ఆరంధించే ఈ లక్షణం మానవ సభ్యత వికాసక్రమంలో తొలిదశ అని చెప్పవచ్చు అమ్మె ప్రకృతి. అసలు అమ్మ ఆగ్రహిస్తే ధరాతలమే దద్దరిల్లుతుంది.

ఎప్పటినుంచి మొదలైనాయి ?

హైదరాబాదు నగరం అమ్మ ఆగ్రహాన్ని చవిచూసిన దుర్ఘటన మళ్లీ ప్రకృతిదిశగా సాగేలా చేసింది.
ఓ కొత్త ఉత్సవ సంప్రదాయానికి నాంది పలికింది. ఆ సంకటంలోంచి ఉద్భవించిన సంప్రదాయమే బోనాలు ఉత్సవం. 1869వ సంవత్సరంలో హైదరాబాదు, సికిందరాబాదు ప్రాంతాలలో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి ప్రబలింది. చూస్తుండగానే , వేలాదిమంది ఆ వ్యాధికి బలైనారు.

ప్రకృతి ప్రకోపాన్ని గమనించిన పెద్దలు, ఆ ప్రకృతిమాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు, జాతరలు జరపాలని నిర్ణయించారు. ఈ జాతర లేదా పర్వపు మూల మానవహాని చేసే మహాంతక వ్యాధులు సోకకుండా ఆ తల్లిని కోరుకోవడమే. ఈ ఉత్సవానికి వారు పెట్టుకున్న పేరు బోనాలు.

శిష్ట వ్యవహారంలో జరుపుకునే / పండుగలలో కూడా దైవీ శక్తులకు నైవేద్యాలు సమర్పించడం సంప్రదాయం. అమ్మవారు చిత్రాన్నప్రియ అని స్తోత్రాలు చెబుతున్నాయి. అందుకే అమ్మను ప్రసన్పం చేసుకోవడానికి భోజనం సమర్పించడ బోనాల పర్వంలోని పరమారం. అసలు భోజనం సంస్కృతపదానికి వ్యావహారిక రూపం బోనం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం.

Bonalu Jatara Celebrations Start in Golkonda, Hyderabad | Oneindia Telugu
speciality of bonalu in telangana

ఎలా చేస్తారు ?

బోనాల కోసం కొత్త కుండలను మాత్రమే వాడుతారు. శుచిగా, పవిత్రంగా అన్నం వండి, ఘటంలో అంటే కుండలో ఉంచి, ఆ ఘటానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, వేపాకులతో అలంకరిస్తారు. ఆ ఘటంపైన ప్రమిద వెలిగించి, వినయంగా తలపై మోసుకుంటూ ఆడపడుచులు అమ్మవారికి తీసుకువస్తుంటే ఆ శోభ వర్ణనాతీతం.
పట్టుబట్టలు, పూలు, నగలు, మొహంపై వేల్లీవిరిసే సంతోషతరంగాలు ఈ శోభను మరింత పరివృద్ధం చేస్తాయి. మంగళ వాయిద్యాలు, డప్పుల సంగీతం మధ్య మహిళలు ఊరేగింపుగా వెల్లీ, అమ్మకు ఈ ఘటాలను సమర్పిస్తారు. ఇలా బోనం తలకెత్తుకున్న మహిళలను అమ్మశక్తికి ప్రతీకగా భావించి, భక్తులు వారి కాళ్లపై నీరు పోస్తుంటారు.

బోనాల క్రమము

బోనాలు సంబరాలు ఆషాఢమాసంలో తొలి ఆదివారంనాడు ఎల్లమ్మ దేవతను పూజించడంతో మొదలవతాయి. మారెమ్మ పెద్దమ్మ అంకాలమ్మ పోలేరమ్మ తదితర కాళీమాత రూపాలను పూజిస్తారు. గోల్కొండ కోటలో ఉన్న జగదంబిక ఆలయంలో " ఆరంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలను ఆ తర్వాత హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాత్రటీ ఉన్న లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్లోని ఉజయినీ మహాకాళి / దేవాలయాలలో అత్యంత వైభవోపేతం నిర్వహిస్తారు.

ఆ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ, ఆమెను పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో సంబరం ప్రారంభమౌతుంది. ఘటంతో అమ్మవారికి స్వాగతం పలకడం పూర్ణకుంభ స్వాగతమన్న మాట. అమ్మవారిని ఆవాహన చేసిన ప్రత్యేక కలశాలను పురవీధులతో ఊరేగిస్తారు. ఘటోత్సవం బోనాలకు ఆరంభం. బోనాలు ఆరంభం అయిన తరువాత ఈ ఘటాలను 15 రోజుల పాటు ప్రతి వ్రాడకు, ప్రతి ఇంటికి తీసుకువెళతారు.

అమ్మకు సాకం:

అమ్మకు అన్నం జానపదుల భాషలో సాకం, పాకం అని వంటలు రెండు రకాలు. సాకం అంటే వండని ఆహారం. పాకం అంటే వండినది. ప్రసాదాలుగా ఇచ్చే పాయసం వంటి పాకాలు. అమ్మవారికి సాకం సమర్పించడం సంప్రదాయం కనుక బోనాల సందర్భంగా వేపమండలను పసుపు నీటిలో ఉంచి, అమ్మవారికి సమర్పిస్తారు. దీన్నేసాకమివ్వడం అని పిలుస్తారు. ఇలా సాకాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల అన్నపానాలకు లోతురానివ్వదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bonalu is an important festival celebrated in twin cities and in other parts of Telangana. The word “Bonalu” is derived from “Bhojanalu” meaning food, which is offered to the Goddess.
Please Wait while comments are loading...