సంక్రాంతికి ముందు భోగీ: ఎందుకు, ఎలా చేస్తారు?

సంక్రాంతికి ముందు రోజు తెలుగు ప్రజలు భోగీ పండుగ జరుపుకుంటారు. అలా ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యం ఎమిటనేది చదవండి....

భోగిపండుగ ఇంద్రుని గుణించి చేయబడే పండుగగా కనిపిస్తుంది. ఇంద్రుడు మేఘాధిపతి. మేఘాలు లోకానికి వర్షాలు ఇస్తాయి. పంటలు పండడానికి వర్షాలు అవసరం. కాగా సకల వర్షాల కోసం ఇంద్రుని పూజించే ఆచారం ఏర్పడింది.
ఇట్టి పూజల వలన ద్వాపరయుగంలో ఇంద్రుడికి గర్వం హెచ్చిపోయింది. అందుచేత అతనికి గర్వభంగం చేయాలని కృష్ణుడికి తోచింది. ఇంతలో ఒకానొక భోగిపండుగ వచ్చింది.

యాదవులందరూ ఇంద్రపూజకు ఆయత్తులయ్యారు. అప్పడు ఆ గొల్లలతో కృష్ణుడు ఇట్లా చెప్పాడు. "మనం గోవులను మేపుకొనే గొల్లలం. కర్షకులకువలె మనకు వర్షాలు అంతగా అక్కరలేదు. మన గోవులకు మేత ఇచ్చేది గోవర్ధన పర్వతం మిది పచ్చికబయలు. కాబట్టి మనం ఈనాడు గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాము. వర్షాధిపతి ఇంద్రపూజ జోలికి మనం పోవద్దు.

The importance of Bhogi festival

కృష్ణుని ఈ మాటలకు గొల్లలు అంగీరించారు. ఇంద్రపూజకు స్వస్తి చెప్పారు. గోవర్ధనగిరిని పూజించడానికి ప్రారంభించారు. ఇంద్రుడు ఇది తెలిసికొన్నాడు. అతనికి కోపం వచ్చింది. తన మేఘాలను వదిలి పెద్ద వర్షం కురిపించాడు. ఆ జడివానలో తడిసి మద్దయి గొల్లలు శ్రీకృషునితో తమ గోడు చెప్పకున్నారు. అప్పడు శ్రీకృష్ణుడు గోవర్ణనపర్వతాన్ని ఎత్తి పట్టుకుని యాదవులకు అందరికీ వారి గోవులతో దాని క్రింద ఆశ్రయం కల్పించాడు.

తన వద్ద ఉన్న ఏడు రకాల మేఘాలను వదిలి గారించి కూడా ఇంద్రుడు యాదవులను ఏమిూ చేయలేకపోయాడు.
అందుతో ఇంద్రుడికి గర్వభంగమై బుద్ధి వచ్చింది. కృష్ణుని మహత్తు తెలిసికొని ఇంద్రుడు అప్పడు పాదాక్రాంతుడయ్యాడు. అందుమిూద కృష్ణుడు అతనిని మన్నించి భోగిపండుగనాడు మామూలుగా మళ్లీ ఇంద్రపూజ జరిగేటట్టు ఆనతి ఇచ్చాడు.

భోగిపీడ వదలడానికి - భోగి పండుగనాటి విధులు

భోగినాడు తెల్లవారగట్లనే లేచి, అభ్యంగన స్నానం చేయడం విధాయకకృత్యం. ఆ స్నానంతో భోగిపీడ వదులుతుందని నమ్ముతారు.

చంటి పిల్లలకు భోగిపీడ కేవలం తలంటుతోనే కాక మధ్యాహ్నం 'భోగిపళుపోయడంతో కాని వదలదంటారు. ఈ భోగిపళ్లు పోయడమనేది దృష్టిపరిహారార్థం చేసే కర్మగా కనిపిస్తుంది.

చంటిపిల్లలకు కొత్తదుస్తులు తొడుగుతారు. కుర్చీ మిూద కూర్చోపెడతారు. రేగుపళ్లపైసలు, చెరుకు ముక్కలు బంతిపూలు కలిపి తలవిూద నుంచి దిగువారపోస్తారు. దీనిని బోడికలు పోయడం అనిన్నీ కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఇట్లా చేయడం ఆపిల్లలకు ఆయుర్వృద్దికరమై ఉంటుందని ఆంధ్రస్త్రీల నమ్మిక,

క్రీడలు

భోగిపండుగనాడు తమిళనాట విందు భోజనాలు విరివిగా సాగుతాయి. ఆనాడు సాధారణంగా ప్రతివారు పులగం వండుకుంటారు.

ఆనాడు అందరూ విరివిగా ఆటల్లో పాల్గొంటారు. తమిళనాడులో గ్రామ ఉమ్మడి స్థలాన్ని మండైవెలి అంటారు. ఆనాడు గ్రామస్తులందరూ అక్కడ చేరుతారు. అందరూ పల్లెటిపటు ఆటల్లో పాల్గొంటారు. సాయంకాలం వరకు 'ఆనందం గోవిందంగా కాలక్షేపం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+