ఈ వాస్తు దోషాలతో ఇంట్లో వాళ్లకు రోగాలు పక్కా!
వాస్తు శాస్త్రం మనిషి జీవితాన్ని సానుకూలంగా ముందుకు నడిపేలా చేస్తుంది. అందుకే ఎవరు ఏ నిర్మాణం చేపట్టాలన్నా వాస్తు చూసుకొని మరీ చేస్తారు. అటువంటి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఇంట్లో వస్తువులను కూడా వాస్తు ప్రకారం పెట్టుకుంటే, ఆ ఇంట్లో సమస్యలు పెద్దగా ఉండవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.
రోగాలకు కారణం అయ్యే వాస్తు దోషాలు
వాస్తు ప్రకారం ఇల్లును నిర్మించుకోక పోయిన, వాస్తు ప్రకారం ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకోక పోయినా కూడా దాని ప్రభావం ఇంట్లో జీవించే వారి పైన ఉంటుందని చెబుతున్నారు. వాస్తు దోషాలు ఉన్న ఇల్లు రోగాలతో, అనారోగ్య సమస్యలతో ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం రోగాలకు కారణమయ్యే వాస్తు దోషాలను గురించి తెలుసుకుందాం.

వాస్తు దోషాలు ఉంటే శారీరక, మానసిక సమస్యలు
వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వాస్తు నియమాల ప్రకారం బావులు లేదా కుళాయిలు వంటి నీటితో సంబంధం ఉన్న ఏదైనా దక్షిణం మరియు పడమర దిశల మధ్య ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అసలు ఈ దిశలో వాషింగ్ మెషిన్ కానీ వాష్ బేసిన్ కానీ ఏర్పాటు చేయడం కూడా మంచిది కాదని సూచిస్తుంది.
నైరుతిలోను వాస్తుదోషాలతో ఆరోగ్య సమస్యలు
నీటితో సంబంధం ఉన్నవి దక్షిణం మరియు పడమర దిక్కులలో ఉంటే ఆ ఇంట్లోని వారు రోగాల పాలవుతారు. ఈశాన్యంలో వంటగది ఉంటే ఆ కుటుంబంలోని వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నైరుతిలోను వాస్తుదోషాలు ఉంటే ఆర్థిక సమస్యలతో పాటు వారు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తూర్పు దిశలో వాస్తు దోషం, లేదా ఏదైనా అడ్డు ఉంటే వారు నరాల బలహీనతను, గుండె జబ్బులను, కంటి సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ వాస్తు దోషాలు ఉన్నా రోగాలే
తూర్పు బహిర్గత ద్వారంలో వాస్తు దోషాలు ఉంటే ఉదర సంబంధమైన సమస్యలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలను బెడ్ మీద పెట్టుకుంటారు. వారు మానసిక సమస్యలను, గుండె సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాదు జీరో వైబ్రేషన్ ఎనర్జీతో కూడిన మెటాలిక్ ఫర్నిచర్ వాడడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మందులు ఆ దిశలో పెట్టినా రోగాలు తగ్గవు
ఇంట్లో ఎవరైనా జబ్బుతో బాధపడుతుంటే వారి మందులను దక్షిణం వైపు పెడితే వారికి వ్యాధి నయం కాకపోగా, మరింత సమస్యాత్మకంగా మారుతుంది ఇన్వర్టర్ ల వంటి పెద్ద పెద్ద బరువైన వస్తువులను ఈశాన్యం లేదా ఉత్తర దిశలో ఉంచకూడదని చెబుతున్నారు. ఈశాన్య దిశను, ఉత్తర దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ఆ రెండు దిశలలో శుభ్రంగా లేకపోతే వాస్తు దోషం తలెత్తి కుటుంబంలోని వారు రోగాల పాలవుతారని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
‘ఇళ్లు లేని పేదవాడు’ ఉండకూడదు. 2029 నాటికి 17 లక్షల గృహాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications