బుధుడి డబుల్ రాజయోగాలతో వీరికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ప్రతి 15 రోజులకు తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. బుధుడు వివిధ గ్రహాలలోకి సంచారం చేస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను సృష్టిస్తాడు.బుధాదిత్య,
బుధాదిత్య , లక్ష్మీ నారాయణ రాజయోగాలు
వ్యాపారానికి కారకుడైన బుధుడు డిసెంబర్ 6వ తేదీ రాత్రి 8.52కు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి డిసెంబరు 29వ తేదీ వరకు అక్కడే ఉండనున్నాడు. అప్పటికే వృశ్చిక రాశిలో సూర్యుడు, శుక్రుడు ఉండటం వల్ల బుధుడు, సూర్యుడుతో కలిసి బుధాదిత్య రాజయోగాన్ని, శుక్రుడితో కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టిస్తున్నాడు. ఒకేసారి రెండు శక్తివంతమైన యోగాలను సృష్టించడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
బుధుడి కారణంగా ఏర్పడుతున్న రెండు రాజ యోగాలతో మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి విజయాలు వరిస్తాయి. పెద్ద ప్రాజెక్టుల బాధ్యత మీకు వచ్చి చేరుతుంది .వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. విద్యారంగంలో ఉన్నవారికి డబ్బులు వస్తాయి. ఆర్థికంగా ఇది మీకు మంచి సమయం. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.
సింహరాశి
బుధుడి కారణంగా ఏర్పడుతున్న బుధాదిత్య, లక్ష్మీనారాయణ రాజయోగాలు సింహ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు మీకు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాలలోనూ మీరు లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి బుధాదిత్య, లక్ష్మీనారాయణ రాజయోగాలు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ సమయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది .దీర్ఘకాలిక కెరీర్ సవాళ్లు మరియు పని ఒత్తిడి తగ్గుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో గణనీయమైన డబ్బును సంపాదిస్తారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుకూల వాతావరణం ఉంటుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications