today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు!
వేద జ్యోతిషశాస్త్రంలో మార్చి 21వ తేదీన ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సూర్యుడు మీనరాశిలో సంచారం చేస్తుండగా చంద్రుడు మేష రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు, గురువు వృషభ రాశిలోనూ, శుక్రుడు మీన రాశిలోను, రాహు కేతువులు మీనా , కన్య రాశులలోను సంచారం చేస్తున్నారు.
ముఖ్య గ్రహాల సంచారం..వీరికి సానుకూల, ప్రతికూల ఫలితాలు
శని కుంభరాశిలో, ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదంలోనూ సంచారం చేస్తుండగా, బుధుడు కుంభరాశిలో ప్రత్యక్షంగా మారుతున్నాడు. ఈ పరిణామాలు ద్వాదశ రాశుల వారి జాతకాల పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని రాశులవారికి కలిసి వస్తుండగా, మరికొన్ని రాశులవారు ప్రతికూల ఫలితాలను చూస్తారు.

మేషం
మేష రాశి వారికి నేడు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఖర్చులు కొంచెం పెరుగుతాయి.
వృషభం
వృషభ రాశి జాతకులకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూల సమయం.
మిథునం
మిధున రాశి వారు నేడు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
సింహం
సింహ రాశి జాతకులకు నేడు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
కన్య
కన్యారాశి జాతకులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం సాధిస్తారు.
తుల
తులా రాశి జాతకులకు వివాహ, శుభకార్యాలకు అనుకూల సమయం. కుటుంబ సహకారం ఉంటుంది. అన్ని విధాల మంచి జరుగుతుంది
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇది వీరికి సానుకూల ఫలితాలను ఇచ్చే సమయం.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు నేడు అదృష్టం కలిసి వస్తుంది. ధనస్సు రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
మకరం
మకర రాశి జాతకులకు నేడు పనిలో ఒత్తిడి ఉంటుంది. మకర రాశి వారు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.
కుంభం
బుధుడు డైరెక్ట్ కావడం వల్ల కుంభ రాశి జాతకులకు నేడు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కమ్యూనికేషన్ మెరుగవుతుంది.
మీనం
మీనరాశి జాతకులకు నేడు మానసిక ప్రశాంతత ఉంటుంది. ధన లాభం పొందే అవకాశం ఉంది.మొత్తం మీద ఈ రోజు కొన్ని రాశులకు ఆర్థిక లాభాలు, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరంగా కనిపిస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications