వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: దక్షిణం దిశలో ఈ 5వస్తువులు ఉన్నాయా? వెంటనే తొలగించండి.. లేదంటే ప్రమాదం!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రంలో ప్రతి దిక్కుకు ఒక విశిష్టత కచ్చితంగా ఉంటుంది. ఇక వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దక్షిణ దిక్కు విశేషమైన శుభఫలితాలను ఏ విధంగా అయితే ఇస్తుందో అంతే తీవ్రమైన అశుభ ఫలితాలను కూడా ఇస్తుంది. దక్షిణ దిక్కు వాస్తు సరిగ్గా ఉంటే ఆ ఇల్లు సుఖసంతోషాలతో విలసిల్లుతోంది. దక్షిణ దిక్కులో వాస్తు దోషాలు ఉంటే చాలా భయానక విషయాలు జరగవచ్చు. మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. అందుకే దక్షిణ దిశ పట్ల ఎప్పుడూ జాగ్రత్త వహించాలి అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దక్షిణం దిశలో కొన్ని వస్తువులను అసలే పెట్టకూడదు

దక్షిణం దిశలో కొన్ని వస్తువులను అసలే పెట్టకూడదు

హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా దక్షిణం దిక్కు విషయంలో వాస్తు నియమాలు పాటిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. దక్షిణం ఎక్కువగా చెడును సూచిస్తుంది. అందుకే దక్షిణం దిక్కు విషయంలో వాస్తు నియమాలు పాటించాలి. దక్షిణం దిక్కులో కొన్ని వస్తువులను అసలే పెట్టకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. దక్షిణ దిశ పూర్వీకుల దిశగా చెప్తారు. అందుకే దక్షిణం దిశలో ఏవైనా పెట్టకూడని వస్తువులను పెడితే వారికి కోపం వస్తుందని చెప్తారు. ఇంతకీ దక్షిణం దిశలో ఉండకూడనివి ఏమిటి అంటే ..

దక్షిణం దిశలో చెప్పుల స్టాండ్ పెడుతున్నారా? అయితే కలహాలు

దక్షిణం దిశలో చెప్పుల స్టాండ్ పెడుతున్నారా? అయితే కలహాలు

దక్షిణం దిశలో చెప్పులను ఉంచకూడదు. దక్షిణం దిశలో పాదరక్షలు, బూట్లు ఉంటే మంచిది కాదని చెప్తున్నారు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఎప్పుడూ దక్షిణం దిశలో ఉండకూడదు. దక్షిణం దిశలో చెప్పుల స్టాండ్ ఉంటే పెద్దలకు అవమానం జరిగినట్టు అవుతుంది. అలా చెయ్యటం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇంట్లో ప్రశాంతతకు భంగం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ దక్షిణం దిశా వైపు చెప్పులు పెట్టకూడదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

తులసిమొక్కను దక్షిణం దిశలో పెడితే జరిగేదిదే

తులసిమొక్కను దక్షిణం దిశలో పెడితే జరిగేదిదే

ఇక దక్షిణం దిశలో పొరబాటున కూడా తులసి మొక్కను పెట్టకూడదు . తులసిమొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తారు. తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. చాలా మంది నిత్యం పూజాధికాలు చేస్తారు. కాబట్టి తులసి మొక్కను ఎప్పుడూ పొరపాటున కూడా ఇంటికి దక్షిణ దిశలో పెట్టకూడదు. ఒకవేళ దక్షిణం దిశలో పెడితే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలా తులసి మొక్కను దక్షిణం దిశలో పెడితే లాభానికి బదులు నష్టం జరుగుతుంది.

దక్షిణం వైపు పూజగది ఉంటే దరిద్రం వచ్చే అవకాశం

దక్షిణం వైపు పూజగది ఉంటే దరిద్రం వచ్చే అవకాశం

పూజగది ఇంట్లో చాలా పవిత్రమైన స్థలం. పూజ గదిని ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. తూర్పువైపు తిరిగి భగవంతుడిని మనం పూజించుకునేలా పూజగది ఉండాలి.
ఇక అటువంటి పూజ గదిని చాలా మండి స్థలాభావం కారణంగా దక్షిణం వైపు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పొరబాటున కూడా పూజ గదిని దక్షిణం వైపున నిర్మించకూడదు. అలా చేస్తే సానుకూల ఫలితాలకు బదులు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇంట్లో దరిద్రం వచ్చి పడుతుంది. అన్ని పనుల్లోనూ నష్టం జరుగుతుంది. ఇక ఈ దిక్కులో పూజ గది ఏర్పాటు చేసి పూజలు చేసినా ఫలితం దక్కదు.

బెడ్ రూమ్ విషయంలో జాగ్రత్త.. దక్షిణం వైపు ఈ పని చెయ్యకండి

బెడ్ రూమ్ విషయంలో జాగ్రత్త.. దక్షిణం వైపు ఈ పని చెయ్యకండి


ఇక ఇంట్లో అత్యంత ముఖ్యమైన గది పడక గది. మీ బెడ్ రూమ్ విషయంలో, పడుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. పాదాలు ఎప్పుడూ దక్షిణం వైపుకు ఉండకుండా ఉండేలా జాగ్రత్త పడండి. అలా కాకుండా దక్షిణం వైపు పాదాలు ఉండేలా పడుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది. భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం చెడిపోతుంది. అందుకే బెడ్ రూమ్ విషయంలో దక్షిణం దిశను దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

వంటగది విషయంలో జాగ్రత్త.. దక్షిణాన వంట మంచిది కాదు.. ఎందుకంటే

వంటగది విషయంలో జాగ్రత్త.. దక్షిణాన వంట మంచిది కాదు.. ఎందుకంటే

ఇక వంటగదిని ఇంటికి దక్షిణం దిశలో నిర్మాణం చెయ్యరాదు. ఎట్టి పరిస్థితిలోనూ వంటగది ఎంట్రన్స్ దక్షిణం దిశలో ఉండేలా ఉండకూడదు. ఇది ఇంట్లో మహిళల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఇది పేదరికానికి కూడా దారితీస్తుంది. ఇంట్లో డబ్బు రావటం ఆగిపోయి ప్రతికూలత వ్యాపిస్తుంది. కనుక వంటగది కూడా దక్షిణం దిశలో ఉండకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక దక్షిణం దిశలో పెద్ద చెట్లు ఉండొచ్చని, దక్షిణం దిశకు ఉండే ప్రాధాన్యత మేరకు జాగ్రత్తలు పాటిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Are there a chappal stand, tulsi plant, kitchen, and pooja room in the south direction? Do you put your feet to the south while sleeping? But experts of Vastu Shastra say that it should be changed immediately or there will be a danger
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X