వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశీ యాత్రలో ఏం చూడాలి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కాశీ.. వారణాశి. సాక్షాత్తు కైలాసనాథుడి దివ్యక్షేత్రం. ఆ క్షేత్ర దర్శనం జన్మరాహిత్యం కలిగిస్తుంది. అయితే ఆ క్షేత్రంలో.. ఏం చూడాలి? అక్కడ క్షేత్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం. కాశీలో ప్రవేశించగానే ముందుగా.. కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా.. గంగా దర్శనం.. గంగా స్నానం. కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది) కాశీ భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది.

అన్నపూర్ణ దర్శనం భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).కాశీ విశాలాక్షి దర్శనం వారాహి మాత గుడి ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

What should one see in varanasi

మణికర్ణికా ఘట్టంలో స్నానం. ( వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి ) గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు) కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం చింతామణి గణపతి దర్శనం అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ లోలార్కఈశ్వరుని దర్శనం దుర్గా మందిరము, గవ్వలమ్మ గుడి, తులసీ మానస మందిరము, సంకట మోచన హనుమాన్ మందిరం, తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం. తిలాభాండేశ్వర దర్శనం.

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం ఇది కొంతదూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్. గంగా నదీ ఘట్టాల దర్శనం అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు. ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమిపై అవతరించిన చోటు. గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి. లేకపోతే నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు. కాశీ క్షేత్రంలో బస చేసినన్ని రోజులు మనస్సు ప్రశాంతగా పెట్టుకుని నిరంతరం దైవనామ స్మరణ మననం చేస్తూ ఉండాలి.

English summary
Kaasi and Varanasi is the holy shrine and what should one see when visited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X