పుష్కరుడు ఎవరు?: 12 ఏళ్లకు ఒకసారే పుష్కరాలెందుకు?..

Subscribe to Oneindia Telugu

పుష్కరుని తపస్సు

పుష్కరుడను ఒక మహానుభావుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన దివ్యతపస్సు గావించాడు. ఆతని తపస్సుకు మెచ్చి వరము కోరుమనగా "ఓ బ్రహ దేవా! నన్ను పరమపావన తీర్ధముగా మార్చి నాలో స్నానమొనరించు వారందరి పాపాలు నశించి పవిత్ర పుణ్యం కలుగజేయండని అడుగగా. సంతోషముతో పుష్కరుని కోర్మెను మన్నించాడు." అప్పటినుంచి పుష్కరుడు దేవలోకమున ఆకాశగంగలో కలిసి పవిత్రుడై యున్నాడు.
దేవేంద్రుడు శాపవిముక్తుడగుట

సమస్తలోకాలకూ, అష్టదిక్పాలురకూ, అధిపతియైన మహేంద్రుడు అహంకారంతో కన్నుగానక అందమైన స్త్రీలను జూచి అఱులు చాచి వారలను చెరుస్తున్నాడు. త్రిలోకసుందరి గౌతముని భార్య, అహల్యాదేవి, ఆమెను కామించి ఒకరోజు యింద్రుడు గౌతమ మహర్షి రూపంతో అహల్యను మాయచేసి మోసం గావించాడు. అందువలన గౌతముడు యింద్రునికి శాపమిచ్చాడు.

Why do we celebrate Pushkaralu every 12 years?

ఆ శాప ఫలాన్ని అనుభవిసూ యింద్రుడు మతిస్థిమితం లేక తిరగడం ప్రారంభించాడు. ఎచ్చటికి వెళ్లినా మహేంద్రుడైన యింద్రుని ముల్లోకాల వారూ నీచంగా చూడసాగారు. అప్పడింద్రుడు బ్రహ్మదేవుని పాదాలపైబడి "బ్రహ్మదేవా! నన్ను రక్షించండి. నా పాపము బాయగల ఉపాయము చెప్పండి. సురాపాన మత్తుచేత మహాపతివ్రతయైన తమ సుతకు అన్యాయం గావించాను.

పరమ తపోమూర్తి గౌతముని దారుణ శాపము పొందాను. యిూ పాపము రూపుమాపడానికి తమరే సమర్థులు" అని దీనముగా మహేంద్రుని బ్రహ్మలేవనెత్తి 'మహేంద్రా! నీవు విచారించకు. ఆకాశ గంగానదిలో అంతర్భూతముగా ఉన్న "పుష్కర పుణ్యతీర్ధము"న నీవు స్నానముగావించిన నీ పాపము నిన్ను వీడి నీకు యధారూపము వస్తుంది" అన్నాడు.

బ్రహ్మ బ్రహ్మవాక్యానుసారముగా ఇంద్రుడు పుష్కర తీర్ధమున నిత్యమూ స్నానముగావించి గౌతముని వలన తాను పొందిన శాపాన్ని బాసి మరల సురేంద్రుడై నాడు. అందువలన మహేంద్రాదు లందరూ పరమ పావనుడైన పుష్కరుని యిూ స్వర్గమును విడిచి యొచ్చటికీ వెళ్లవద్దని కట్టడి చేశారు. దానివలన పుష్కర తీర్థము అమరలోకాన్ని విడిచి ఒక్క అడుగు ముందుకు వేయలేక పోయాడు.

బ్రహ్మపుష్కరుని భూమికి పంపుట

గౌతముని వలన కలిగిన శాపము ఇంద్రుడు పోగొట్టుకొనుట ముల్లోక వాసులూ ఆశ్చర్యముగా చెప్పకొన సాగారు. పుష్కరుని ముఖ్యముగా భూలోకానికి వచ్చునట్లు చేయ ప్రయత్నించి మహరులందరూ బ్రహ్మదేవుని దగ్గరకు నేగి అతని ననేక విధాల ప్రార్ధించారు.

బ్రహ్మ కరుణించి మహరులందరినీ అడుగగా 'ఓ కమలాసనా! భూలోకవాసులైన మానవులు యేదోవిధముగా పాపము చేస్తుంటారు. వారి పాపాన్ని బాపట తమ కర్తవ్యము. కనుక తమరు మాపై కరుణించి పుష్కరుని భూలోకానికి వచ్చునట్లు అనుగ్రహించండి" అని దీనముగా, లోకకల్యాణము మహర్షుల ప్రార్ధన మన్నించాడు బ్రహ్మదేవుడు.

12 సంవత్సరాలకి ఒకసారి ఎందుకు?

"ఓ మహరులారా! మీ కోరిక మెచ్చదగినది సమస్త మానవాళికి సమస్త పాపములు బాపి పుణ్యము సంపాదించుకూ సమస్త కల్యాణము లందుటకూ మీ 888 దివ్యెషధము కాగలదు, జీవులందరకూ గలిగిన పాపతాపాలు పరిహరింప చేయగలవి తీర్థములే, అందువలన జీవుల శుభాశుభములు వారి వారి జన్మకర్మల ననుసరించు జరిపించునవి ద్వాదశరాశులు.

యూ రాశులు సాక్షీభూతములై సకలమునకూ కారణముగా గాన్పించును. భూలోకమున గల పవిత్ర నదీమతల్లులు గూండాం సరిగా 12గా భాసిస్తున్నాయి. పరమ పవిత్రమగు పుష్కరతీర్ధము దేవగురువు బృహస్పతి బుద్ధిశాలి. సమస్త మేధాశక్తులకు అధిష్ణాన దైవమైన బృహస్పతి సంవత్సరమునకు ఒక రాశియందు ప్రవేశించు సమయమున యీ పుష్కర తీర్ధమానదియందం తర్భాగమై మొదట 12 దినములు, చివర 12 దినము లుండగలదు" అని మహరులకు బ్రహ్మదేవుడు వరమిచ్చెను.

భూమియందు ముఖ్యముగా ఆర్శభూమియగు మనభారతదేశమున గల 12 పవిత్రమైన నదులందు సంవత్సరానికి ఒకనదికి పుష్కరము వచ్చును. పుష్కరుడు వచ్చుచున్నాడని సమస్త తీర్ణములూ కలిసి ఆ నదియందు అంతర్భాగమై పుష్కరునిలో కలిసి ఆ పుష్కర సమయమున నిలిచి అప్పుడా" స్నానముగావించు తైర్థికులకు సమస్త పాపములు పోగొట్టి పవిత్రత నాపాదింప చేయును.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pushkaram is a festival of rivers pertains to 12 important rivers in India which occurs once in 12 years for each river.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X