India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవీ నవరాత్రులు: దుర్గాష్టమి ప్రాముఖ్యత..

|
Google Oneindia TeluguNews

ఆశ్వయుజమాసం వచ్చింది అంటే! ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ" గుర్తుకు రావటమే! అమ్మ అంటే! మరి ఎవరోకాదు ఆజగన్మాత, ముగ్గురమ్మలతల్లి, అమ్మలగన్నఅమ్మ 89 నవదుర్గాస్వరూపిణి.

ఎందరో మహాయోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టియందుగల చరాచర వస్తువులన్నిటియందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగిఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల , గాలి, నిప్ప, నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢిగా అందురూ ఆమోదించే విషయం. ఆశక్తినే మహేవ్వరీ శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిసూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే

ఈశక్తి కనుక లేకుంటే! శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" యని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే! సర్వపాపాలు నాశనమౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియచెస్తోంది.

Importance of Durga Ashtami

దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షించుటకుకొనుటకు ! ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గములేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండమందు వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా! ఆ జగన్మాత సంతసించి కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయి వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.

ఆ దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా 1. శైలపుత్రి 2. బ్రహ్మచారిణి 8. చంద్రఘంట 4 కూష్మాండ 5. స్కందమాత 6. కాత్యాయనీ 7. కాళరాత్రి 8. మహాగౌరి 9. సిద్ధిధాత్రి అను రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది.

తొలుత ఈ దేవదేవి "శ్రీ కృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలలో పూజలందుకుంది. "బ్రహ్మ"కైటభుల బారి నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు. "పరమేశ్వరుడు" త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. "దేవేంద్రుడు" దూర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందకలిగినాడు.

ఇలా మహామునులు, దేవతలు, సిద్ధి, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవీ కటాక్ష పాత్రులవుతున్నారు.

ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రముతో కూడియున్న
శుభదినాన ఈ దేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెపోంది. అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు.

అందు మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధనతో జ్ఞానాన్ని పొందాలి అని పెద్దలు చెప్తారు.

ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు

. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని ఒక విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో !
శ్లో శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ

అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది మ=మాయ, న=లేకుండా, వ=వర్తింప చేసి తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము.

శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయ కాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించుటవల్ల ఆ శమీవృక్షము, "రామస్య ప్రియదర్శిని" అయినది అని అంటారు. అందువలన భారతీయులంతా దీనిని విజయ ముహూర్తంగా పరిగణిస్తారు.

ఇలా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా? మనకు ఏర్పడిన సర్వ దుఃఖాలు ఉపసమనం పొందాలన్నా? దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతోపాటు శ్రీలలితాసహస్రనామ పారాయణలు నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము.

English summary
Durgashtami, or Durga Ashtami, is the eight day of the Navratri and Durga Puja celebrations. Durgastami is also known as Mahashtami and is one of the important days of Durga Puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X