వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఐటీలో కోటి రూపాయల వేతనాన్ని గెలుచుకున్న మెకానిక్ కుమారుడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: కాన్పూర్ ఐఐటీలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్ధికి అరుదైన అవకాశం లభించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో 17 ఏళ్ల వయసున్న ఆయూష్ శర్మ కోటి రూపాయల స్కాలర్ షిప్‌కు అర్హత సాధించాడు.

ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్ధ ఎంఐటీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు కాన్పూర్ కి చెందిన ఆయూష్‌ శర్మ‌ టోఫెల్ ప్రవేశపరీక్షలో నెంబర్ వన్ స్ధానంలో నిలిచి కోటి రూపాయల ఉపకారవేతనాన్ని గెలుచుకున్నాడు. ఆయూష్‌ శర్మ‌ ప్రస్తుతం కాన్పూర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నాడు.

 Mechanic’s son gets over a crore rupees in form of an MIT scholarship

ఈ సందర్భంగా ఆయూష్ శర్మ మాట్లాడుతూ ఎంఐటీలో సీటు సంపాదించడం తన కల అనీ, మన దేశనుంచి అర్హత సాధించినముగ్గురిలో ఒకడిగా ఉండటం సంతోషంగా ఉందంటున్నాడు. ఇక ఆయూష్ శర్మ తండ్రి రాకేశ్ శర్మ ప్రజా పనుల విభాగంలో ఓ మెకానిక్‌గా పనిచేస్తుండగా తల్లి మంజులత శర్మ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గా పదవీ విరమణ చేశారు.

కాన్పూర్‌లోని ఐఐటీ క్యాంప్‌సలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థి అయిన ఆయుష్‌ శర్మ ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాశాడు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసించేందుకు ఆయూష్ శర్మ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లనున్నాడు. కోటి రూపాయల స్కాలర్ షిప్‌కు అర్హత సాధించినందుకు శర్మ తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో ఉన్నారు.

English summary
In a commendable achievement, a 17-year-old student from Kalyanpur locality here has won over a crore rupee of scholarship to pursue engineering at the world's famous Massachusetts Institute of Technology (MIT) in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X