హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్న పార్టీలతో కాదు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu
హైదరాబాద్‌: చిన్న పార్టీలు కాంగ్రెస్‌ను ఎదుర్కోలేవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టిడిపిలాంటి పెద్దపార్టీతోనే అది సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. ఈ కోణంలో ఆలోచించే పలు పార్టీల నేతలు, పార్టీని వీడి వెళ్లినవారు తిరిగి టిడిపిలో చేరుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు అడిగినా, అడక్కున్నా రేషన్‌కార్డులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్నికలయ్యాక బోగస్‌ కార్డుల పేరుతో తీసేస్తోందని విమర్శించారు. "ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌లో శంకుస్థాపనలు మొదలుపెట్టారు. ఎన్నికలయ్యాక చేసేదేమీ ఉండదు. కాంగ్రెస్‌ హయాంలో అక్రమ పాలన నడుస్తోంది. ప్రజలు, ప్రతిపక్ష నేతలపై దాడులు, తప్పుడు కేసులు, వేధింపులు పెరిగిపోయాయి. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోయాయి. వైఎస్‌ అనుచరులు వచ్చి హైదరాబాద్‌ చుట్టూ భూ మాఫియాలా తయారయ్యారు. టిడిపి హయాంలో హైదరాబాద్‌లో ఒక్క రౌడీ కూడా లేకుండా చేశాం. గత ఐదేళ్లలోను, ఇప్పుడు అంతా మాఫియా, ఉగ్రవాదుల మయంగా మారిపోయింది" అని విమర్శించారు.

హైదరాబాద్‌కు తాము అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్నో మురికికూపంగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉండగా కృష్ణా జలాలను రాజధానికి తరలిస్తే ఆ నీటిని కూడా సరిగా పంపిణీ చేసే పరిస్థితిలో కూడా వైఎస్‌ సర్కార్‌ లేదని విమర్శించారు. భోలక్‌పూర్‌లో కలుషిత నీటిని సరఫరా చేసి ప్రాణాలు బలిగొన్నారన్నారు. ఆఖరికి చెత్త రవాణా కాంట్రాక్టులోనూ ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "హైదరాబాద్‌ చుట్టూ 200పైగా ఇంజనీరింగ్‌ కళాశాలలు మా హయాంలోనే వచ్చాయి. డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి 27లక్షలమందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వం కనీసం వాటికి గ్యాస్‌ సరఫరా చేయలేకపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దళారుల దోపిడీ పెచ్చుమీరిపోయింది" అని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌ నగర శివార్లు తెదేపాకు కంచుకోటగా ఉండేవి మొన్నటి ఎన్నికల్లో కొన్ని లోటుపాట్ల వల్ల ఓడిపోయామన్నారు. వచ్చే గ్రేటర్‌ ఎన్నికల్లో మళ్లీ పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట మాజీ ఎంపీ, మాజీ మంత్రి మల్యాల రాజయ్య శుక్రవారమిక్కడ చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఎన్నికలకు ముందు ప్రరాపాలో చేరిన ఆయన.. అక్కడినుంచి ఇప్పుడు తెదేపాలోకి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X