తెలంగాణపై నిర్దిష్ట నిర్ణయం: పిఎంతో జయప్రకాష్ నారాయణ
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. ఆయన బుధవారం ప్రధానితో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు అభిప్రాయాలే కాకుండా ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని, అప్పుడు నిర్దిష్ట నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిణామాల ప్రభావం దేశంపై కూడా పడుతుందని ఆయన అన్నారు. ప్రజల అభీష్టం మేరకే శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాని చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీలు వేసి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కారానికి నిజాయితీగా చర్యలు చేపట్టాలని కూడా ఆయన అన్నారు. బలవంతంగా రుద్దడం వల్ల పరిష్కారం లభించదని ఆయన అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని ప్రకటన చేయడం మంచిదని కూడా ఆయన సూచించారు. జరిగిన పరిణామాల తప్పొప్పుల గురించి మాట్లాడడం సరి కాదని కూడా ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి