రామలింగరాజుకు రక్తస్రావం, మళ్ళీ నిమ్స్ కు

Ramalinga Raju
హైదరాబాద్: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిన సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు ఆరోగ్య పరిస్ధితి దిగజారింది. ఆయనను మళ్ళీ నిన్న నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతోంది. రామలింగరాజు చాలాకాలంగా హెపటైటిస్- సి వ్యాధితో బాధపడుతున్నారు.

గత ఏడాది డిసెంబర్ 16న రామలింగరాజు ప్రకటించిన నిర్ణయం మోసంగా ధృవపడి ఆయనను కటకటాల పాలుచేసింది. తన కుటుంబానికే చెందిన మేటాస్‌ ప్రాపర్టీస్‌ లో 100 శాతం; మేటాస్‌ ఇన్‌ఫ్రాలో 51 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు ఆ రోజు సాయంత్రం ప్రకటించి కార్పొరేట్‌ రంగంలో ఓ సంచలనం సృష్టించారు. ఆ కొనుగోలు విలువ 1.6 బిలియన్‌ డాలర్లు అంటే రూ.7,680 కోట్లన్నమాట. అంతే ఒక్కసారిగా దేశ, విదేశీ మదుపుదార్ల నుంచి రాజుకు ఫోన్ల వర్షం. అందరి నుంచీ ప్రతిఘటన ఎదురైంది. ఒక ఐటీ కంపెనీ స్థిరాస్తి కంపెనీలను ఏ ప్రాతిపదికన కొంటుంది? అసలు వాటి విలువను ఏ విధంగా లెక్కగట్టారు అని ప్రశ్నించారు వారంతా. ఉక్కిరిబిక్కిరైన రాజు ఆ ప్రతిపాదనను 17 సాయంత్రానికల్లా విరమించుకున్నారు.

జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. సత్యం షేర్లు సగానికి సగం పైగా పతనం అవడం పక్కన బెడితే బోర్డు సభ్యులు తమ తప్పు లేదంటూ వైదొలగడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో బోర్డు సమావేశానికి నాయకత్వం వహించిన అప్పటి ఐఎస్‌బీ డీన్‌ రామ్‌మోహన్‌ రావు సహా స్వతంత్ర డైరెక్టర్లు సత్యం బోర్డుకు రాజీనామా చేశారు. డైరెక్టర్లందరూ ఒక్కొక్కరిగా వైదొలుగుతున్న తరణంలోనే రామలింగరాజు సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. కంపెనీలో ఖాతాలను ఎక్కువ చేసి చూపించామని, రూ.7,500 కోట్ల మేరకు ఖాతాల కుంభకోణం జరిగిందని స్వయంగా వెల్లడించారు. అంతే అప్పటి దాకా ఉన్న రాజయోగం కాస్తా కటకటాలు లెక్కించాల్సిన స్థితికి తీసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+