వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విమానం పేల్చివేత కుట్ర వెనక ఆల్ ఖైదా

విమానంలో 278 మంది ప్రయాణికులున్నారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు ఆ సంఘటన జరిగింది. పేలుడు పదార్థాలను పేల్చడానికి ప్రయత్నించిన వ్యక్తిపైకి మరో వ్యక్తి దూకి అతన్ని అడ్డగించే ప్రయత్నం చేశాడు. మిగతా వారు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తి ప్యాంట్స్ సగం చిరిగి పోయాయి. కాళ్లు కాలిపోయాయి. ఆ తర్వాత విమానం డెట్రాయిట్ లో సురక్షితంగా దిగింది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విమాన భద్రతా సిబ్బందితో మాట్లాడారు. ఈ సంఘటనతో అమెరికాలో రెడ్ అలర్డ్ ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు అమెరికా శ్వేత సౌధం అధికారులు చెప్పారు.