విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన వల్లనే ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఆయన ముందుకు కదిలేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా కాలంగా రాధాకృష్ణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెసు నుంచి ఆయన చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు.
శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా రాజకీయాల్లో కనిపించడం లేదు. ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఏర్పడితే అభివృద్ధి చెందుతామని ఎజెండాతో ఆయన ముందుకు సాగారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి