హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యంగా ఉంటేనే ముద్దు: సమైక్యాంధ్ర జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తు ప్రగతి సమస్యలు తదితర అంశాలను పూర్తి గణంకాలతో శ్రీకృష్ణ కమిటీకి వివరించినట్టు సమైక్యాంధ్ర జెఎసి నేతలు వెల్లడించారు. ఒకే భాష, సంస్కృతి కలిగిన ప్రాంతాలు కలిసి ఉంటేనే రాష్ట్ర సమస్యలపై పోరాడటం సులభమవుతుందని తాము శ్రీకృష్ణ కమిటీకి చెప్పినట్లు సమైక్యాంధ్ర జెఎసి నేతలు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి క్రమంలో కొన్ని చారిత్రక తప్పిదాలు జరిగినా ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని స్పష్టం చేశామని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ నేతృత్వంలో జెఎసి ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీకృష్ణ కమిటీని కలిసి తన వాదనలు వినిపించింది. హైదరాబాద్ ‌ను వేరు చేసి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి గురించి చెప్పాల్సిందిగా కమిటీ కోరిందని, మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందేందుకు ఉన్న ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించిందని కమిటీతో భేటీ అనంతరం శామ్యూల్ మీడియా ప్రతినిదులకు తెలిపారు.

మూడు ప్రాంతాల్లోని వెనకబాటుతనాన్ని తొలగించేందుకు, వెనుకబడినవర్గాలకు మేలు చేసేందుకు ఉన్న మార్గాలను చెప్పాలని కోరిందన్నారు. ఈ అంశాలపై మరో నివేదికను అందిస్తామని కమిటీకి చెప్పామని శామ్యూల్ పేర్కొన్నారు. కమిటీని కలిసిన వారిలో జెఎసి అధ్యక్షుడు పి. నరసింహారావు, ఈజే నాయుడు, ఎంఎల్ కాంతారావు, నారాయణ తదితరులు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X