కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటే చర్యలు: డిజిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Girish Kumar
కరీంనగర్‌: తెలంగాణలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు 80 పారా మిలటరీ బలగాలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగామీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అడ్డుకోవాలని చూస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసే విషయంలో తన చేతిలో లేదని, ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. ఐఎస్‌ఐకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. వికారుద్దీన్ ‌ను పట్టుకోడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరాల నివారణకు హైదరాబాదులో సైబర్ కంట్రోల్ పోలీసు స్టేషనును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X