హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల రవి హత్యలోనూ భాను కిరణ్ పాత్ర, మొద్దు శీనుతో గొడవ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Ravi
హైదరాబాద్: పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్యలో భానుకిరణ్ కూడా కీలక పాత్ర వహించాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. సూరిని హత్య చేసిన నేపథ్యంలో పరిటాల రవి హత్యలో భాను సంబంధాలను బయటపెట్టేందుకు సూరి అనుచరులు సిద్ధపడినట్లు తెలుస్తోంది. పరిటాల హత్య కేసులో విచారణ ఎదుర్కొన్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ నేత అనేక కొత్త విషయాలను తమకు వెల్లడించినట్లు ఆ దినపత్రిక రాసింది. రవి హత్యకు ముందు మొద్దు శీను, రేఖమయ్యకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గన్స్, వాటి రౌండ్లు భానూయే సమకూర్చాడని, తమిళనాడు నుంచి మరో నలుగురిని తీసుకొచ్చారని చెప్పారు. రవి హత్యానంతరం మొద్దు శీనుతో టీవీ ఇం టర్వ్యూ ఇప్పించడంలోనూ భాను పాత్ర ఉందని చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.

అరెస్ట్‌కు ముందు ఢిల్లీలో తలదాచుకున్న శీను భానుతో అనేకసార్లు గొడవ పడ్డాడని చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. శీను కొంతకాలం అనంతపురం జి ల్లా జైల్లో ఉన్నప్పుడు సూరి కూడా అక్కడే ఉన్నాడు. తన కుటుంబానికి డబ్బులు పంపించే విషయంలో భాను నిర్లక్ష్యంగా ఉంటున్నాడని, భానును అన్ని విషయాల్లో నమ్మవద్దని, వీలె ౖతే కొంత దూరం పెట్టాలని సూరికి శీను సూచించాడని ఆ నేత వివరించారు. సూరికి భాను నమ్మిన బంటు కావడంతో పాటు కేసులో ఆయన్ను ఇరికించకూడదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచినట్టు తెలిపారు.

ఆ పత్రిక కథనం ప్రకారం - సూరి హత్యానంతరం అనంతపురంలోని భాను నివాసంలో ఇటీవల పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా మంగళి కృష్ణకు చెందిన లేఖలు దొరికినట్లు తెలిసింది. తనకు రక్షణ కావాలని ప్రభుత్వ పెద్దల కు కృష్ణ రాసిన లేఖల ప్రతులు దొరికాయని తెలుస్తోంది. పరిటాల హత్యలో కృష్ణ పాత్ర కూ డా ఉందనే ఆరోపణలు రాగా అప్పుడాయన ఖండించారు. ఒకసారి పరిటాల ఆయన పేరును ప్రస్తావించి, తనను హతమార్చేందుకు ప్రైవేటు గ్యాంగ్ నడుపుతున్నాడని ఆరోపించా రు. ఇప్పుడు అదే కృష్ణ లేఖలు భాను నివాసంలో లభించడం గమనార్హం. భాను చిక్కితే పరిటాల హత్యోదంతంలో అనేక మంది పెద్దల పాత్ర బయటపడుతుందంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X