వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్లీనుండి ఢిల్లీ వరకు ఉద్యమం: తెలంగాణ కోసం టి-టిడిపి వ్యూహరచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugu Desam Party
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరు కోసం తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యులు మంగళవారం టిడిఎల్పీలో సమావేశమయి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టి-టిడిపి రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీ వరకు పోరు సాగించాలని చూస్తోంది. ఈ నెల 18వ తేదిన గవర్నర్ నరసింహన్‌ను కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణలో ఉన్న ప్రత్యేక సెంటిమెంటును కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాల్సిందిగా కోరే అవకాశం ఉంది. గవర్నర్‌ను కలిసే అవకాశం లేని పక్షంలో తెలంగాణ మంత్రుల ఇళ్ల ముందు ఆందోళన చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.

కాగా ఈ నెల 20వ తేది నుండి 25వ తేది వరకు న్యూఢిల్లీలో మకాం వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడే ఉండి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరంను కలిసి తెలంగాణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో విస్తృత పర్యటనల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Telangana TDP MLAs wrote strategy for Telangana fight today. They met in TDLP and decided to tour in Telangana after sessions. Between 20 and 25 they went New Delhi and met Prime Minister, president for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X