• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సత్య సాయిబాబా బందీ అయ్యారా, నమ్మినవారే మోసం చేశారా?

By Pratap
|

Sathya Sai Baba
హైదరాబాద్: పుట్టపర్తి సత్య సాయిబాబాపై ఆంధ్రజ్యోతి దినపత్రిక సంచలనాత్మక వార్తాకథనాన్ని ప్రచురించింది. ఇదే కథనాన్ని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ గురువారం సాయంత్రం ప్రసారం చేసింది. సత్య సాయిబాబా బందీ అయ్యారని, సహాయకులు ఆయనను చెర పట్టారని, భగవాన్ మానసిక వేదనతో కృంగిపోతున్నారని వ్యాఖ్యానించింది. సత్యజిత్ అనే సహాయకుడు బాబాను మోసం చేశాడని ఆరోపించింది. ఆరు నెలలుగా బాబా మాట్లాడడం లేదని, ఆప్తులను కూడా బాబా చెంతకు రానివ్వడం లేదని చెప్పింది. ఐసియులో వైద్యం తెలియని వ్యక్తి ఉన్నాడని చెబుతోంది. సత్యసాయిబాబాను గత నెల 28వ తేదీన ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి సత్యజిత్ కనిపించడం లేదని తెలిపింది.

సత్య సాయిబాబాకు సత్యజిత్ శౌరి అనే వ్యక్తితో కలిసి గంజిలో నిద్రమాత్రలు వేసి ఎవరికీ తెలియకుండా తాగిస్తూ వచ్చారని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాము సంపాదించినట్లు ఆంధ్యజ్యోతి చెప్పుకుంది. సత్యజిత్ అనే అల్పజీవి సాక్షాత్తూ సత్యసాయినే గుప్పిట్లోకి తీసుకున్నాడని ఆరోపించింది. సత్య సాయిబాబాను ఎలా మోసం చేశారనే విషయాలను బయట పెట్టిన శ్యాంసుందర్ లేఖను తాము సంపాదించినట్లు తెలిపింది. శ్యాంసుందర్ లేఖలోని అంశాలను కూడా పత్రిక క్రోడీకరించింది. గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖం పక్షవాతంతో బాధపడడం చూస్తున్నానని, ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా, దాని గురించి ఎవరూ మాట్లారని, వారికి అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి కావచ్చునని శ్యాంసుందర్ తన లేఖలో రాసినట్లు పత్రిక వివరించింది.

సత్య సాయిబాబాకు సత్యజిత్ ఒక్కరొక్కరినే దూరం చేస్తూ వచ్చాడని, పూర్తిగా బాబా తనపైనే ఆధారపడేలా చేసుకున్నాడని, బాబా మాటలను పట్టించుకోకుండా తన ఇష్టప్రకారం సత్యజిత్ చేస్తూ వచ్చాడని, బాబా కార్యకలాపాలను సత్యజిత్ నిర్ణయించేవాడని, భక్తుల దర్శనానికి కూడా సరిగా తీసుకుని వచ్చేవాడు కాదని ఆంధ్రజ్యోతి ఎబిఎన్ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆరు నెలలుగా బాబా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారట. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత బాబాను చూడడానికి వెళ్లిన మంత్రి గీతా రెడ్డికి లోపల నడుస్తున్న వ్యవహారమంతా తెలిసిందని ఆ చానెల్ వ్యాఖ్యానించింది.

English summary
Andhrajyothy daily reported a news report on Sathya Saibaba's condition. It revealed that Sathya kit assistant of Baba has ditched Sathya Saibaba for his own interests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more