చిత్తూరు: జిల్లాలో ఓ మహిళా ఆధ్యాపకురాలు ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పుత్తూరుకు చెందిన లలిత అనే మహిళ గత కొన్నాళ్లుగా శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఆధ్యాపకురాలిగా (లెక్చరర్‌గా) పని చేస్తోంది. అయితే మంగళవారం ఉదయం ఆమె చనిపోయి ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
లలితకు నెల రోజుల క్రితమే వివాహం అయింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేదా హత్య జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్యపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.