సింఘాల్ కేసు: అక్బరుద్దీన్‌పై విచారణ వాయిదా

గురువారం ఉదయం పోలీసులు అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి తరలించరాు. 2005లో అప్పటి కలెక్టర్ సింఘాల్‌ను దూషించారని ఆరోపిస్తూ నమోదైన కేసులో విచారణ నిమిత్తం అక్బరుద్దీన్‌ను పోలీసులు కోర్టుకు తరలించారు. ఈ సమయంలో మజ్లీస్ పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున కోర్టు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.
లాఠీచార్జీ చేసి మజ్లీస్ కార్యకర్తలను పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. అంతకు ముందు బుధవారం రాత్రి బయలుదేరి పటాన్‌చెర్ సిఐ రవీంద్ర రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా కారాగారం చేరుకుంది. అక్బరుద్దీన్‌ను తీసుకుని సంగారెడ్డికి బయలుదేరింది.
అప్పటి కలెక్టర్ సింఘాల్‌ను దూషించిన కేసులో అక్బరుద్దీన్‌పై పిటి వారంట్ జారీ అయింది. దాన్ని అమలు చేయడంలో భాగంగా అక్బరుద్దీన్‌ను పటాన్‌చెరు పోలీసులు సంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు.
ఇదిలావుంటే, మజ్లీస్ శానససభ్యుడు అక్బురుద్దీన్ ఓవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న కమలానంద భారతిని గురువారం ఉదయం సిట్ పోలీసులు హైరాబాదులో తమ కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తరలించారు. కమలానంద భారతిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్. రథాదెవి ఆదేశాలు జారీ చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications